దశాబ్దాలు మారే కొద్దీ ప్రపంచ దేశాలకు యుద్ధం చేసే పద్ధతి మారుతూ వస్తోంది. అప్పట్లో కత్తులతో యుద్ధం చేస్తుంటే.... అది కాస్తా కొద్ది కొద్దిగా రూపు మారి చివరికి అణు ఆయుధాల వరకు వచ్చింది. ఆ తర్వాత సమాచారం లీకేజీ ని ఆయుధంగా చేసుకుని యుద్ధాలు చేసుకుంటే ఇప్పుడు బాయోవార్ సరికొత్త ట్రెండ్ అయింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా వైరస్ చైనాలో మొట్టమొదట వచ్చిన కొద్ది రోజులకి ఆ దేశ పరిస్థితిని మరియు వారి ప్రవర్తనను చూసి వారే కావాలని వైరస్ ను పుట్టించారు అని అంతా తీవ్రమైన ఆరోపణలు చేశారు.

 

అయితే కొద్ది నెలల పాటు చైనాలో విలయతాండవం చేసిన ఈ వైరస్ చివరికి అక్కడ అనూహ్యరీతిలో అంతరించింది. కానీ ప్రపంచ దేశాలలో మాత్రం రోజుకి వేలాది మందికి సోకుతూ.... వందలాది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటోంది. ముఖ్యంగా ఇటలీలో అయితే రోజుకు సగటున 700 మంది చనిపోవడం గమనార్హం. ఇప్పుడు చైనా వారు కుట్రపూరితంగా ఇటలీలో ఈ వైరస్ ను ఎవరూ ఊహించని రీతిలో వ్యాప్తి చెందేందుకు పన్నిన పన్నాగం బట్టబయలు చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది.

 

చైనా నుంచి కరోనా వైరస్ సోకిన ఒక యువకుడు చైనా కి వెళ్ళాడు. అప్పటికే కరోనా గురించి ప్రపంచమంతా తెలిసే ఉంది కానీ ఇటలీలో మాత్రం దాని ఆచూకీ లేదు. ఆ యువకుడు ఇటలీ వీధుల్లోకి వెళ్లి కళ్ళకు నల్లని గంతలు కట్టుకొని ఒక బోర్డు పట్టుకుని ఉన్నా. అందులో చైనా వారంతా కరోనా వైరస్ బారిన పడలేదని.. తనూ మనిషేనని కావాలంటే అతనిని ముట్టుకోమని అందులో రాసి ఉంది.

 

కావాలంటే తనని ప్రేమగా కౌగిలించుకోవచ్చని అతను అన్న మాటలకు వారంతా జాలిపడి అతని మరియు కౌగిలించుకోగా... అతనిని ముట్టుకున్న ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ సోకింది. అలా కొన్ని వందలమంది అతని ద్వారా కరోనా సోకగా వారి నుండి కొన్ని వేల మందికి అంటి ఇప్పుడు ఇటలీ మొత్తం స్మశానంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: