నవరసాల్లో ఒక రసం శృంగారం. ఇది సృష్టి ధర్మం. ప్రతి ఒక్కరికీ ఇది ఇష్టమే. సెక్స్ లో ఒక్కొక్కరు ఒక్కో సమయంలో పాల్గొంటూ ఉంటారు. శృంగారంలో ఎప్పుడు పాల్గొన్నా కూడా మంచి సుఖాన్ని పొందవచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సమయాల్లో శృంగారంలో పాల్గొనడం వలన సుఖంతో పాటు మంచి మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది. చాలా మంది రాత్రి సమయంలో శృంగారంలో పాల్గొంటూ ఉంటారు. 

 

అయితే రాత్రి శృంగారంలో పాల్గొన్నా కూడా మళ్లీ ఉదయం సెక్స్ లో పాల్గొంటే చాలా మంచిదని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. ఉదయం పూట సెక్స్ లో పాల్గొంటే మంచి థ్రిల్ వస్తుందంట. రీసెంట్ గా జరిగిన ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో చాలా మంది మార్నింగ్ సెక్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారని, మధ్యాహ్నం రాత్రి వేళలతో పోల్చుకుంటే ఈ సమయమే సెక్స్ కు చాలా అనుకూలమని భావిస్తున్నారని ఈ సర్వే ద్వారా వెల్లడైంది. ఈ జనరేషన్ లో భార్యాభర్తలు రోజంతా ఆఫీసులో పని చేసి, బయట ఎక్కడెక్కడో తిరిగి, ప్రయాణం చేసి, ఇంటి బాధ్యతల గురించి ఆలోచిస్తూ రాత్రి ఇంటికి చేరుకుంటారు. ఒత్తిడి వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారు. కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోవాలని భావిస్తారు. రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రపోయి, ఉదయం ఉత్సాహంగా మేల్కొంటారు. 

 

ఇలాంటి సమయంలో సెక్స్ చేయడం వల్ల ఇరువురూ తృప్తిని పొందుతారు. మార్నింగ్ సెక్స్ మిమ్మల్ని ఉత్సాహంగా మార్చడమేకాకుండా మీలో దీర్ఘకాల జ్ఞాపకశక్తిని పెంపొందించి మతిమరుపు సమస్యను పోగొడుతుంది. అంతేకాకుండా మార్నింగ్ 5 నుంచి 8 గంటలలోపు మీరు సెక్స్ లో పాల్గొనేలా ప్లాన్ చేసుకోవాలని సెక్సాలజిస్టులు సూచిస్తున్నారు. ఆ సమయంలో అయితే మగవారిలో టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా విడుదలవుతుంది కాబట్టి సెక్స్ చేస్తే ఇద్దరికీ సాటిస్ఫాక్షన్ కలుగుతుందని చెప్తున్నారు. వారానికి కనీసం మూడుసార్లు మార్నింగ్ సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల గుండె పోటు, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చనే విషయం కూడా చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: