ప్రపంచ వ్యాప్తంగా కరోనా భాదితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. దేశాల వారీగా వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన ఎంతో మందిని ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉంచి చికిత్స లు చేస్తున్నారు చాలా దేశాలలో పాజిటివ్ కేసులు నెగిటివ్ గా నమోదయ్యి అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని ఇళ్ళకి వెళ్లిపోతున్నారు....కానీ చైనా తాజాగా ప్రకటించిన ఓ  విషయం ఇప్పుడు ప్రపంచ దేశాలని సందిగ్ధంలోకి నేట్టిసింది...అదేంటంటే...

IHG

కరోనా చికిత్స పొంది రోగి పూర్తిగా కోలుకున్న తరువాత కూడా రోగి శరీరంలో కరోనా వైరస్ 8 రోజులు తిష్ట వేసుకుని ఉంటోందట. ఈ విషయాన్ని పరిశోధన ద్వారా తెలుసుకున్న చైనా శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలని హెచ్చరిస్తున్నారు. జనవరి 28 నుంచీ ఫిబ్రవరి మొదటి వారంలో బీజింగ్ పీఎల్ఏ జనరల్ ఆసుపత్రిలో 16 మంది రోగులు చికిత్స పొంది ఇళ్ళకి వెళ్ళిపోయారు..అయితే అలా వెళ్ళిన 16 మందిలో మళ్ళీ కరోన వైరస్ లక్షణాలు కనిపించాయట. వారి ఆరోగ్య పరిస్థితులలో వచ్చిన మార్పులని గమనించిన వైద్యులు  ప్రతీ రోగిని రోజు విడిచి రోజు వారి గొంతులో ఉన్న లాలాజల సాంపిల్స్ తీసుకుని పరీక్షలు జరిపారట శాస్త్రవేత్తలు.

IHG

దాంతో వారిలో సగానికి సంగం మందికి ఇంకా శ్వాస నాళాలలో కరోన వైరస్ ఉండటం గమనించారట. కానీ వారిలో కరోన లక్షణాలు ఏ మాత్రం కనపడలేదని ఇలాంటి సమయంలో వారు ఎవరితో నైనా కలిస్తే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శాస్త్ర వేత్తలు చేసిన ఈ తాజా అధ్యయనంలో భారత్ కి చెందిన శాస్త్రవేత్త లోకేశ్ శర్మ కూడా పాల్గొన్నారు. చైనా శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు యావత్ ప్రపంచ దేశాలని ఆందోళనలోకి నెట్టేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నెగిటివ్ గా నమోదు అయ్యాక డిశ్చార్జ్ అయ్యి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు..వారి శరీరంలో కరోనా ఇంకా కరోనా ఉండిఉంటే ఇప్పటి వరకూ చేసిన లాక్ డౌన్ అంతా వృధానేనా అనే ఆందోళన వ్యక్తమవుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: