క‌రోనా వైర‌స్(కొవిడ్-19) విశ్వాన్ని ఏ విధంగా వణికిస్తోందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. భూమ్మీద జీవులన్నింటిపై ఆధిపత్యం చెలాయించిన మనిషినే ఓ వైరస్ వణికిస్తోంది. దీంతో ఏ దేశంలో చూసినా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పోస్ట్ మ్యాన్ నుంచి ప్రధాని వరకు ఏ ఒక్కరిని వైరస్ వదలడం లేదు. గతేడాది డిసెంబరు చివరిన చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం ప్రాణాంతక వైరస్ ఖండంతరాలను దాటి విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి అన్ని దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించింది. 

 

దీంతో అత్యవసర సేవలు మినహా అన్నీ బందయ్యాయి. అయితే ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్టు... ఈ కరోనా లాక్ డౌన్ మందుబాబుల ప్రాణం మీదకు తెస్తుంది. మందు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. చుక్క పడనిదే దేహం కదలని పరిస్థితుల్లో మందుబాబులు ఏం చేయాలో తెలియ‌క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు మరీ అతిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే, ఇందూరులో మ‌ద్యం కోసం ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గింది. 

 

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆదివారం మద్యాహ్నం నుంచి వైన్స్ ఓపెన్ చేయనున్నారని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదనే ప్రచారం నిన్న జోరుగా జరిగింది. మ‌రియు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ పేరిట ఒక నకిలీ  నోట్ కూడా నెట్టింట్లో వైర‌ల్ అయింది. అంతేకాకుండా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ షాపులు తెరవాలని, కానిస్టేబుళ్లను కాపలాగా పెట్టి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, విక్రయాలు సాగించాలని ఈ నోట్ లో ఉంది. దీంతో మందుబాబులు పండ‌గ చేసుకున్నారు. అయితే ఈ నోట్ ను ఆబ్కారీ శాఖ తీవ్రంగా  ఖండించింది. అటువంటి ప్రకటన ఏదీ తాము విడుదల చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఎవరో ఆకతాయిలు పాత నోట్ ను వైర‌ల్ చేశార‌ని.. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: