దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 918కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. కరోనా గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దేశంలోని ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా కానీ కరోనాపై యుద్ధం చేయడానికి పోరాడుతున్న కార్యకర్తలు ప్రతిరోజూ బయటకు వెళుతూనే ఉన్నారు. 
 
ఒక డాక్టర్ కరోనా గురించి స్పందిస్తూ దేశం ఓడిపోవడానికి వీలు లేని యుద్ధం కరోనా అంటూ వ్యాఖ్యలు చేశారు. నిపుణులు కరోనా దేశంలో అదుపులోనే ఉందని... కరోనా విజృంభించకుండా నియంత్రించటానికి గడువు ఇంకా మించిపోలేదని చెప్పారు. మరోవైపు కరోనాపై మొదటి నుండి పోరాడుతున్న కార్యకర్తలు మాత్రం భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థకు భారీ విస్ఫోటనాన్ని తట్టుకోగల సామర్థ్యం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
దేశంలో ప్రతి 2000 మందికి ఒక ఆస్పత్రి పడక మాత్రమే ఉండటంతో జనాభాలో వైరస్ పది శాతం మందికి సోకినా కోటీ 30 లక్షల మంది ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఉంది. భారత్ లాక్ డౌన్, ప్రజలు సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని భావిస్తోంది. కరోనాకు ఎదురెళుతూ డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారా మెడికల్ సిబ్బంది నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. 
 
పలువురు వైద్యులు దేశంలో కరోనా మహమ్మారి గురించి స్పందిస్తూ ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వైద్య రంగం సిద్ధంగా లేదనే అభిప్రాయపడుతున్నారు. మరికొందరు వైద్యులు కరోనాను ఎదుర్కొనేలా తాము శిక్షణ పొందలేదని... ఫ్లూ సీజన్ కావడంతో పరిస్థితి మరింతగా దిగజారుతోందని చెప్పారు. డాక్టర్లు, నర్సులకు ప్రభుత్వం రక్షణ పరికరాలు అందించాలని... రక్షణ పరికరాలు ఉంటే మాత్రమే యుద్ధం గెలవడం సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. పలువురు వైద్యులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల వల్ల భారత్ కు కరోనా విస్ఫోటనం తట్టుకునే శక్తి ఉందా...? లేదా...? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వైద్యులే కరోనాను తట్టుకునే శక్తి భారత్ కు ఉందా...? అని ప్రశ్నిస్తూ ఉండటంతో భారత్ కరోనా మహమ్మారీని సమర్థవంతంగా ఎదుర్కోగలదా...? లేదా...? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: