కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు ప్రజల్లో కొట్ట భయాలు మొదలు అవుతున్నాయి. ఇన్నాళ్ళు మాకు ఏమీ ఇబ్బంది లేదు అని భావించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు కరోనా వైరస్ అన్ని ప్రాంతాలకు విస్తరించిన నేపధ్యంలో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎన్ని విధాలుగా ధైర్యం చెప్పినా సరే ప్రజలు మాత్రం కంగారు పడుతూనే ఉన్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా వైరస్ గురించి జరుగుతున్న ఒక ప్రచారం ప్రజలను బాగా కలవర పెడుతుంది.. 

 

ద్రాక్ష పళ్ళు తింటే కరోనా వైరస్ సోకే అవకాశం ఉందనే వార్తలు మరింతగా భయపెడుతున్నాయి. ద్రాక్ష లో జలుబు చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయని అలాగే కమలా కాయలో కూడా కరోనా వైరస్ ని ఆకర్షించే గుణాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు సోషల్ మీడియా లోఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో దొరికే కొన్ని రకాల ఆహారాలు కూడా ఇప్పుడు కరోనా వైరస్ సోకడానికి కారణమని అంటున్నారు. కొన్ని కొన్ని ఆహారాలు కరోనా వైరస్ ని ఎక్కువగా ఆకర్షిస్తాయని ఏమి తినాలి అన్నా సరే వైద్యులను అడిగి తినాలని అంటున్నారు. దీనితో ఇప్పుడు ప్రజల్లో కొట్ట భయం మొదలయింది. 

 

అసలు ఏం తినాలో అర్ధం కాక అందరూ కంగారు పడుతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. చికెన్ తింటే వస్తుంది అది తింటే ఇది తింటే వస్తుంది అంటూ ఎవడికి తూచిన ప్రచారం వాడు చేస్తూ జనాలను మరింతగా భయపెడుతున్నారు. సోషల్ మీడియా మీద ఎన్ని చర్యలు తీసుకున్నా సరే అది మాత్రం అదుపులోకి రావడం లేదు.  ప్రభుత్వాలు హెచ్చరించినా సరే అది మాత్రం కట్టడి అవ్వడం లేదు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: