దేశంలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో కేంద్రం పలు చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌ ను ఎవరూ ఉల్లంఘించకుండా పలు చర్యలు తీసుకుంది. అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది. 

 

ఇప్పటికే దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1000 పైగా నమోదైయ్యాయి. దేశంలో మొదటి కేసు కేరళలో నమోదైయ్యింది. ప్రస్తుతం ఎక్కవ కరోనా కేసులు మహారాష్ట్రలో  నమోదైయ్యాయి. అక్కడ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా శనివారం మరో 230కేసులు నమోదైయ్యాయి.

 

దేశవ్యాప్తంగా వలస కూలీలు తమ కుటుంబాలతో సహా నగరాల నుంచి గ్రామాలబాట పట్టడం ఆందోళన కలిగిస్తోందన్న కేంద్రం... కొవిడ్-19 వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. నిత్యావసర వస్తువుల సరఫరాకు అనుమతించాలని రాష్ట్రాలకు సూచించింది.

 

ఇప్పటికే తెలంగాణాలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. ఇప్పటికే తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు 67కి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న ఈ మహమ్మారి మాత్రం అదుపులోకి రావడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 20 మంది ఈ కరోనా మహమ్మరి బారిన పడి చనిపోయారు.

 

దేశంలో ఈ మహమ్మారి వలన అత్యధికంగా మహారాష్ట్ర నలుగురు, గుజరాత్, రాజస్థాన్‌, కర్ణాటకలో ముగ్గురు, మధ్యప్రదేశ్ ఇద్దరు, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, పశ్చిమ్ బెంగాల్, పంజాబ్‌లో ఒక్కొక్కరు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో విదేశీయుల రాకతో ఈ వ్యాధి ఇంకా ఎక్కువగా వ్యాపిస్తుంది. రానున్న రోజుల్లో బాధితుల సంఖ్య పెరిగే అవకాశలు ఎక్కువగా ఉన్నాయి. దింతో దేశంలో మరి కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతుంది. లాక్ డౌన్ ను అందరు ఒక్క బాధ్యతగా పాటించాలన్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: