ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా వలస కూలీలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఏ ఉపాధి లేక పైసా సంపాదించాలేని ఈ సమయంలో వారు ఆకలిదప్పులతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అన్ని రాష్ట్రాలలోని ప్రజారవాణా కూడా నిలిపివేయడంతో... వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకోలేక తెగ ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ ఎంతవరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితులలో తాము తినడానికి తిండి, తల దాచుకోవడానికి ఇల్లు లేని ఇతర రాష్ట్రాలలో ఇరుక్కుపోతామో అని ఎంతో మంది వలస కూలీలు భయపడుతున్నారు. ఆ భయమే వారిని వందల, వేల కిలోమీటర్లు నడిచేలా చేస్తుంది.



తెలంగాణ రాష్ట్రం లో తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకుంటే... హైదరాబాదు నగరానికి బతుకుతెరువు కోసం వచ్చిన ఓ 20 మంది కూలీలు ఏకంగా 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి సైకిళ్లపై ప్రయాణించాలని నిశ్చయించుకున్నారు. శనివారం రోజు వీరు నాగారం, కీసర ఔటర్ రింగురోడ్డు మీదుగా హైవే ఎక్కి ఉత్తర ప్రదేశ్ కి బయలుదేరగా... చర్లపల్లి డివిజన్ చక్రీపురం చౌరస్తా వద్ద వారిని కుషాయిగూడ పోలీసులు అడ్డగించారు. దాంతో కూలీలు పోలీసులతో మాట్లాడుతూ... తమకి ఉపాధి లేక ఆహారం దొరకడం కష్టంగా ఉందని, అందుకే తమ స్వస్థలానికి వెళ్లి పోతున్నామని చెప్పారు.



ఐతే పోలీసులు వారికి సమాధానం ఇస్తూ ప్రస్తుతం అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేయబడ్డాయని, ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న ఎవర్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదని... తిండితో పాటు ఆశ్రమం కూడా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసిందని... అందుకే మీరు మేము చెప్పినట్లు వినడం మంచిదని వారికి నచ్చచెప్పి కుషాయిగూడ కు తరలించారు పోలీసులు. ఇకపోతే దేశంలో ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు వలస కూలీలు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: