కరోనా మనుషుల్ని చంపడానికే పుట్టింది.. శ్వాసకోశ ఇబ్బందులతో పాటుగా, మానసికంగా కూడా ఇది బ్రతకనివ్వడం లేదు.. ఇప్పటికే కరోనా లేకున్నా కొందరు భయంతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండగా, మరి కొందరు తమకు ఈ వ్యాధి ఎక్కడ వస్తుందో అనే భయంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.. మొత్తంగా ప్రపంచం ప్రశాంతంగా నిదుర పోవడం లేదు..

 

 

ఇక కరోనా విషయంలో రోజుకో వార్త షాకిచ్చే విధంగా బయటకు వస్తుంది.. అసలు కరోనా వల్ల చచ్చే వారికంటే ఈ వార్తల వల్ల పిచ్చివారిగా, మానసిక సంఘర్షణకు లోనవుతూ అనుక్షణం భయపడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు.. ఇదిలా ఉండగా ఇప్పుడు పరిశోధకులు తమ పరిశోధనలో మరో కొత్త విషయాన్ని కనుగొన్నారట.. అదేమంటే కరోనా వైరస్ బారినపడ్డ వ్యక్తులు చిక్సిత్స తీసుకుని కోలుకున్న తర్వాత కూడా వారి నుంచి కోవిడ్-19 సంక్రమించే ప్రమాదం ఉందని తేలిందట..

 

 

ఈ వైరస్ బారిన పడిన బాధితుడు హాస్పిటల్‌లో చికిత్స తర్వాత కోలుకున్న ఎనిమిది రోజుల వరకూ కరోనా వైరస్ వారిలో ఉంటుందని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ, చైనాలోని పీఎల్ఏ జనరల్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో వెల్లడయ్యిందని చెబుతున్నారు... ఇకపోతే ఇప్పటికే దేశంలో కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్న నేపధ్యంలో కొన్ని చోట్ల ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసాయి.. ఎందరో ఉద్యోగాలు ఊడి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు..

 

 

ఇక అక్కడక్కడ ఆకలి చావులు కూడా మొదలయ్యాయి.. ఒక్క సారి చావలేక, చస్తూ బ్రతికే పరిస్దితులు ఇప్పుడు లోకంలో తలెత్తాయి.. కరోనా వ్యాపించడానికి ముందు రోగుల సంఖ్య లక్ష దాటడానికి 67 రోజు పడితే, రెండో లక్ష 11 రోజుల్లోనూ, మూడో లక్ష నాలుగు రోజుల్లోనే చేరింది. ప్రస్తుతం రోజుకు సగటున 66వేల కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నాయి. దీన్ని బట్టి పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్ధం చేసుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: