కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకీ ఎంత ఘోరంగా విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రస్తుతానికి  రాష్ట్రాల వారీగా కరోనా పాజిటీవ్ కేసులతో పాటు మృతుల సంఖ్యతో క్రమంగా పెరుగుతోంది. దేశంలో ధృవీకరించిన కరోనావైరస్ కేసుల సంఖ్య శనివారం (మార్చి 28, 2020) నాటికి 918కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణాల సంఖ్య 20గా ఉంది.   ఈ ఉదయానికి పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 1,029కి పెరిగింది.

 

అధికారిక గణాంకాల ప్రకారం, 920 యాక్టివ్ కేసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతుండగా, 85 మంది రికవరీ అయ్యారు.  24 మంది మరణించారు. ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 186 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. కేరళలో 182 మందికి వ్యాధి సోకగా, ఒకరు మరణించారు. కర్ణాటకలో 81, తెలంగాణలో 67, ఉత్తర ప్రదేశ్ లో 65, గుజరాత్ లో 55, రాజస్థాన్ లో 54, ఢిల్లీలో 49, తమిళనాడులో 42, మధ్యప్రదేశ్ లో 39, పంజాబ్ లో 38, హర్యానాలో 35, జమ్ము కశ్మీర్ లో 33 కేసులు నమోదయ్యాయి. 

 

ఆంధ్రప్రదేశ్ లో 19, పశ్చిమ బెంగాల్ లో 18, లడ్డాక్ లో 13, బీహార్ లో 11, అండమాన్ దీవుల్లో 9, చండీగఢ్ లో 8, చత్తీస్ గఢ్ లో 7, ఉత్తరాఖండ్ లో 6, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో 3, మణిపూర్, మిజోరం, పుదుచ్చేరిల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: