దేశమంతా కరోనా మహమ్మారికి వణికిపోతోంది. వ్యవస్థలన్నీ సైలెంట్ అయిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనునిత్యం పరిస్థిని అంచనా వేస్తున్నాయి. ఈ తరుణంలో పలు సంస్థలు, సెలబ్రిటీలు ప్రభుత్వానికి అండగా, ప్రజలకు ధైర్యంగా నిలుస్తున్నారు. తమ దాతృత్వాన్ని చాటుకుంటూ, ప్రజలకు నిత్యం జాగ్రత్తలు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు ఎంతో ఆరాధించే క్రికెటర్స్ మాత్రం ఏమాత్రం స్పందించటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

పరిశీలిస్తే.. సచిన్ నుంచి కోహ్లీ వరకూ సోషల్ మీడియాలో.. ‘ప్రజలు ఇళ్లలోనే ఉండండి.. జాగ్రత్తలు పాటించండి, పరిస్థితులు బాలేదు’ అని లెక్చర్లు ఇస్తున్నారు. కానీ.. దేశం కోసం ఎటువంటి ఆర్ధికసాయం ప్రకటించిన దాఖలాలు కనిపించటం లేదు. సంపాదన పరంగా చూస్తే భారీ మ్యాచ్ ఫీజులు, యాడ్ లు, ఐపీఎల్ రూపంలో కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్నారు. సంపాదన పరంగా ఇండియన్ క్రికెటర్లు ఎంతో రిచ్ పొజిషన్ లో ఉన్నారు. సచిన్, ద్రవిడ్, గంగూలి, సెహ్వాగ్, ధోనీ, యువరాజ్.. వంటి సీనియర్లకూ ఇప్పటికీ ఎంతో క్రేజ్, సంపాదన ఉన్నవారే. కొందరు బాలీవుడ్ హీరోల్లానే వీళ్లలో కూడా స్పందన లేదు. ఇండియాలో క్రికెట్ ను పనులు ఆపుకుని చూసే అభిమానులు ఉన్నారు. అభిమాన క్రికెటర్ల కోసం ఎక్కడికైనా వెళ్లి మ్యాచ్ లు చూసే ఫ్యాన్స్ ఉన్నారు.

 

 

దేశం మొత్తం ఇబ్బందుల్లో ఉంటే మంచి ప్రజాదరణ ఉన్న క్రికెటర్లు మాత్రం స్పందించటం లేదు. ఎటువంటి జాతీయ విపత్తు వచ్చినా వీరి స్పందన అంతంతమాత్రమే. సీనియర్, రిటైర్డ్, ప్రస్తుతం ఫామ్ లో ఉన్న క్రికెటర్లు ఎప్పుడూ స్పందించలేదనే చెప్పాలి. ఈ విషయంలో టాలీవుడ్ హీరోలు ఉన్నత మనస్తత్వం చాటుకుంటున్నారు. తమిళ నటులు కూడా సాయం చేయడంలో వెనుకాడరు. రీజనల్ లోనే వీరు ఇంత సాయం చేస్తుంటే జాతీయస్థాయి క్రేజ్ ఉన్న క్రికెటర్లు ఇంకెంత సాయం చేయాలి.. అంటూ విమర్శలు వస్తున్నాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: