క‌రోనాను క‌ట్టడి చేసేందుకు ప్ర‌పంచం అంతా ఏక‌మై కృషి చేస్తున్నా క‌రోనా కేసులు మాత్రం రోజు రోజుకు ఏకంగా ల‌క్ష‌ల్లో పెరిగిపోతున్నాయి. అస‌లు ప్ర‌జ‌లు అంద‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దు.. సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని సూచిస్తున్నా ప్ర‌జ‌లు మాత్రం ఏదో ఒక వంక‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో షాపుల వ‌ద్ద ప్ర‌జ‌లు గుంపులు గుంపులుగా గుమి కూడి ఉంటున్నారు. ఓ వైపు మాంసం ద్వారానే ఈ వైర‌స్ ఎక్కువ వ‌స్తుంద‌ని చెపుతున్నా ప్ర‌జ‌లు మాత్రం ఆదివారం మాంసం షాపుల వ‌ద్ద మాంసం కోసం ఎగ‌బ‌డుతున్నారంటే ప‌రిస్థితి ఎలా ఉందో ?  అర్థం చేసుకోవ‌చ్చు.

 

ఇక ఆదివారం మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క‌రోనా పాజిటివ్ బాధితులు 6,64,564 గా ఉన్నారు. వీరిలో 30, 890 మంది చ‌నిపోయారు. 1,42,368 కేసులు రివ‌క‌రీగా ఉన్నాయి. ఇక 4,91,306 కేసులు ప్ర‌స్తుతం యాక్టివ్గా ఉన్నాయి. 1,73, 258 కేసులు క్లోజ్ అయ్యాయి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికాలో క‌రోనా మ‌ర‌ణ మృందంగం మోగిస్తోంది. 

 

ఇక ఆదివారంతో క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా 199 దేశాల‌కు విస్త‌రిస్తోంది. ఇక మ‌న‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 979 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవ్వ‌గా 26 మంది మృతిచెందారు. మ‌హారాష్ట్ర‌లో 193, కేర‌ళ‌లో 176గా కేసులు ఉన్నాయి.  ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ‌లో కేసులు 67 ఉండ‌గా.. ఏపీలో ఈ సంఖ్య 19కు చేరుకుంది. ఆదివారం ఉద‌యం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్ర‌జ‌ల‌తో ఫోన్ ట‌చ్లోకి వ‌చ్చారు. ప్ర‌జ‌లు అంద‌రూ కొన్ని రోజుల పాటు ల‌క్ష్మ‌ణ రేఖ దాట‌కూడ‌ద‌ని.. సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని సూచించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: