క‌రోనాతో అన్నింటిని వాయిదా వేసుకోక తప్పదు. ప్రాణం కంటే ముఖ్యం అయినది ఇంకేమిటి ఉంటుంది....? ఆ ప్రాణమే ఉంటే తర్వాత చేసుకోవచ్చు అని అనుకోక తప్పదు . ఇలా పాటించడమే ఉత్తమం కూడా. అయితే ఇప్పటికే ప్రతీ ఒక్కరు నరేంద్ర మోదీ ఆదేశంలో లాక్ డౌన్ పాటిస్తున్నారు.

 

ఇది నిజంగా సీరియస్ గా తీసుకుని తప్పక పాటించడం అత్యవసరం. కనుకనే తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో కూడా మార్పులు చేశారట . అయితే పరీక్ష తేదీలలో మార్పు చేశారు కానీ ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఇంకా నిర్ణయించ లేదుట. ఇందుకు గాను తెలంగాణ ఉన్నత విద్యా  మండలి ఈ నిర్ణయం తీసుకుందిట.

 

అయితే ఏప్రిల్ 15 వరకు అందరూ లాక్ డౌన్ పాటించక తప్పదు. అయితే ప్రతీ సారి జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ పరీక్షలని న్యాయానికి ఏప్రిల్ 5 న నిర్వహించాలి. కానీ ఈ లాక్ డౌన్ వల్ల ఈ పరీక్షలని వాయిదా వేస్తున్నారట. అలానే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశ పరీక్షలని మే రెండవ వారం జరపాలంట. ఆలా అయితే ఆ పరీక్షలు 31 తో ముగుస్తాయట. కానీ కరోనా వల్ల వీటిని కూడా మారుస్తారని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

 

ఇది ఇలా ఉంటే ఇప్పుడు వ్రాసిన ఇంటర్ పరీక్షల పేపర్లు ఇంకా కరెక్షన్ కి కూడా మొదలు పెట్టలేదు. ఖచ్చితంగా 15 తరవాతే వీటికి మూల్యాణకణ మొదలు పెడతారట. ఇది మాత్రమే కాక పీజీ, డిగ్రీ పరీక్షల నిర్వహణ, ఫలితాలలో కూడా జాప్యం జరగునున్నదిట. ఈ వివరాలని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మoత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలియజేసారు. 

 
 
 
క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: