కరోనా కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించారు. దింతో పాఠశాలలు, సినిమా థియేటర్లు అన్ని బంద్ చేశారు. లాకా డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైయ్యారు. ఇటు పిల్లలకు స్కూల్ మూసివేయడంతో పిల్లలు కూడా ఇంట్లో నుండి బయటికి రావడం లేదు. పిల్లలు ఇళ్లలో ఉంటూ అనేక రకాల ఆటలను ఆడుతున్నారు. ఎక్కువగా ఇండోర్ గేమ్స్ ఆడటానికి మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లోనే ఆడుకుంటున్న ఓ చిన్నారిని మృత్యువు కబళించింది. ఉయ్యాలనే ఆ పాపాయి పాలిట యమపాశమైంది. ఈ విషాదకరమైన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది.

 

వివరాల్లోకి వెళ్తే.. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లిలో గ్రామానికి చెందిన పబ్బతి నర్సయ్య, సరోజ దంపతులకు 14 ఏళ్ల దివ్య అనే కూతురు. బడికి సెలవులు ప్రకటించడంతో ఆ పాపా ఇంట్లోనే ఉంటూ ఆడుకుంటుంది. ఆమె తల్లి తన కూతురు ఆడుకోవడానికి ఇంట్లోనే తన చీరతో ఉయ్యాలా కట్టింది. కానీ ఆ తల్లికి ఎం తెలుసు ఆ ఉయ్యాలే తన కూతురి పాలిట యమపాశం కానున్నదని. ఆ బాలికను ఉయ్యాలా తో ఆడుకోమని చెప్పి తల్లి ఇంట్లో పనులు చేసుకోవడంలో నిమగ్నమైంది.

 

శనివారం సాయంత్రం సరోజ ఇంట్లో దూలానికి చీరతో కట్టిన ఉయ్యాలో దివ్య ఊగుతూ ఆడుకుంటుంది. దివ్య ఉయ్యాలా ఊగుతూ ఇంట్లో పనులు చేసుకుంటున్న తల్లితో మాట్లాడుతూ ఆడుకుంటుంది. దివ్య ఉయ్యాలను చుట్టూ తిప్పుతూ ఆడకోసాగింది. అదే సమయంలో దివ్య వేసుకున్న చున్నీ ఉయ్యాలా కట్టిన చీరలో ఇరుక్కుపోయింది. దింతో దివ్యకు శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరై ఉయ్యాలలోనే తుది శ్వాస విడిచింది. ఇంటి పనుల్లో మునిగిపోయిన ఆ తల్లికి తన కూతురు గుర్తుకు వచ్చి పిలవసాగింది. తన కూతురు దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూసింది.

 

చీరలో చనిపోయిన తన కూతురును చూసి ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించింది. ఆ తల్లి ఏడ్పు విన్న స్థానికులు హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చారు. ఉయ్యాలో చనిపోయిన కూతురిని స్థానికులు కిందకు దించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: