ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఊహించని విధంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. భారత్ లో ఇప్పటి వరకు 979 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వారిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు తెలంగాణాలో 69 కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో 19 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణాలో కరోనా కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. 

 

ప్రపంచ వ్యాప్తంగా ఏడు లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అమెరికా అన్నింటికంటే ముందు ఉంది. అమెరికాలో ఒక లక్షా 24 వేల మందికి కరోనా వైరస్ సోకింది. ఇటలీలో 10 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మెక్సికో లో నెల రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. ఇక కరోనా దెబ్బకు స్పెయిన్ రాణి కూడా ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. జపాన్ లో కరోనా బాధితులు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో మరణాలు 3 వేల వద్దకు చేరుకున్నాయి. హాంకాంగ్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికా ఇప్పటికే పజలను బయటకు రావొద్దని హెచ్చరించింది. 

 

మన దేశంలో మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జపాన్ లో ఒక్క రోజే 68 మందికి కరోనా సోకింది. థాయిలాండ్ లో కరోనా కేసుల సంఖ్య 1500 కి దగ్గరలో ఉంది. స్పెయిన్ సహా కొన్ని దేశాలు ఇప్పుడు లాక్ డౌన్ ని ప్రకటించాయి. అమెరికా మాత్రం కరోనా లాక్ డౌన్ ప్రకటించడానికి ఆలోచిస్తుంది. చైనాలో మళ్ళీ క్రమంగా కరోనా పెరుగుతుంది. మన దేశంలో లాక్ డౌన్ అమలు అవుతుంది.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: