దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000కు చేరువైంది. కరోనా భారీన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రముఖ జ్యోతిష్కుడు ప్రదీప్ జోషి ఏప్రిల్ 8వ తేదీన బుధ గ్రహం మీన రాశిలోకి అడుగుపెడుతుందని... అదే సమయంలో గురు గ్రహం మకరరాశిలోకి ప్రవేశిస్తుందని... రాజు అయిన బుధుడు నీచ స్థానంలోకి వెళ్లడం... అక్కడ రవి కలిసి ఉండటం... జ్ఞాన శక్తిని ఇవ్వాల్సిన గురువు కూడా నీచ స్థానంలోకి వెళ్లిపోతాయని చెప్పారు. 
 
పాప గ్రహమైన కుజుడు ఉచ్ఛ స్థానమైన మకరరాశిలోకి వెళతాడని... శని, కుజుడు కలిస్తే యుద్ధ ప్రభావం ఏర్పడుతుందని చెప్పారు. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 24 వరకు దేశంలో అత్యంత హేయమైన పరిస్థితులు నెలకొంటాయని... ఈ సమయంలో ప్రజలు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. సనాతన ధర్మాన్ని పాటించని వారు, హింసా మార్గాన్ని అనుసరించేవారికి మరింత ప్రమాదకరమైన సమయమని పేర్కొన్నారు, 
 
బుధుడు నీచ స్థానంలో ఉన్నాడంటే వైరస్ ప్రబలే అవకాశం ఉంటుందని అన్నారు. ఏప్రిల్ నెల అంతా దేశ ప్రజలకు ఒక పీడకలలా ఉండిపోతుందని చెప్పారు. ఆర్థిక నష్టాలతో పాటు... గుంపులు గుంపులుగా ఎక్కడికీ వెళ్లలేరని... సినిమా రంగం కుదేలైపోతుందని చెప్పారు. ప్రజా వ్యవస్థలో చాలా రంగాలు కుదేలైపోతాయని.. దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు క్షీణించేపోయే స్థితికి వచ్చిందని తెలిపారు. 
 
మే 4వ తేదీ నుంచి పరిస్థితులు మారతాయని... బుధ గ్రహం మేష రాశి లోకి, రవి గ్రహం మేష రాశిలోకి వస్తాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుందని అన్నారు. ప్రభుత్వం చెప్పిన మాటలు ప్రజలు వినాలని... ఇలాంటి పరిస్థితి క్రీస్తు శకం 1350లో ఏర్పడిందని చెప్పారు. కరోనా వైరస్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని... ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు జాగ్రత్తలు పాటించి మాత్రమే కరోనా భారీన పడకుండా తప్పించుకోవచ్చని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: