నాలుగు నెలల కిందట చైనాలోని వుహాన్ లో ఉద్భవించిన అత్యంత ప్రమాదకర వైరస్ కరోనా (కొవిడ్-19) నేడు 199 దేశాలకు విస్తరించింది.  మొన్నటి వరకు కరోనా అక్కడ కట్టడి అయ్యిందని.. కంట్రోల్ కి వచ్చిందని అన్నారు.  మళ్లీ ఆ దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కొత్తగా 45 మందికి ఈ వైరస్‌ సోకింది. హేనన్, హుబే ప్రావిన్సులలో కొత్తగా 45 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

 


తమ దేశంలోని మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారని ఆ దేశ హెల్త్ కమిషన్ అధికారులు ప్రకటించారు. చైనాలో కరోనా మృతుల సంఖ్య 3,300కు చేరింది.కరోనా ప్రభావంతో ఆయా దేశాల్లో హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ మహమ్మారి రూపం దాల్చిన ఈ వైరస్ చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో భారీగా ప్రాణాలను బలిగొన్నది.  అమెరికా తర్వాత 86,498 కేసులతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. కరోనాకు జన్మస్థానంగా భావిస్తున్న చైనా 81,340 కేసులతో మూడోస్థానంలో ఉంది.

 


స్పెయిన్ లో 64,059, జర్మనీలో 49,344, ఇరాన్ లో 32,332,  బ్రిటన్ లో 14,543, స్విట్జర్లాండ్ లో 12,311, దక్షిణ కొరియాలో 9,332, నెదర్లాండ్స్ లో 8,603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ విజృంభణ అధికంగా ఉన్న వుహాన్‌లో ఇటీవలే సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రయాణ ఆంక్షలను సడలించారు.  కానీ ఇప్పుడు అన్ని చోట్ల కరాళ నృత్యం చేస్తుంది.  మన దేశంలో ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: