క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ఈ పేరు వింట‌నే ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. ఇప్ప‌టికే ఈ వైర‌స్ 185 దేశాల్లో వ్యాపించింది. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా భార‌త్‌లోనూ విజృంభిస్తుంది. ఇప్ప‌టికే దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 933కు చేరుకుంది. కరోనా వైరస్‌తో దేశంలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. అయితే ఈ వైర‌స్ సోకితే చనిపోతారనే ప్రచారం విప‌రీతంగా కొన‌సాగుతుంది. కాని అది నిజంకాదు. ఇప్పటివరకూ ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన వారిలో 18 శాతం మంది మాత్రమే చనిపోయారు. 

 

కాబ‌ట్టి.. ముందు మ‌న భయాలను పక్కన పెట్టి... ఈ వైరస్‌ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా వ్యాపిస్తుంది? ముఖ్యంగా అసలా వైరస్ మన బాడీలో ప్రవేశిస్తే... ఏ రోజు ఏం చేస్తుందో, ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం. వ్యాధి రాగానే ముందుగా జలుబు వస్తుంది. తుమ్మడం, దగ్గడం, జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు వస్తాయి. ఇది ఇక్కడితో ఆగకుండా ఊపిరితిత్తుల వరకూ చేరుతుంది. ఇది న్యూమోనియాకి దారి తీస్తుంది. అయితే ఈ వైర‌స్ సోకితే ఏ రోజు ఏం జ‌రుగుతుంది అన్న‌ది ఇప్పుడు తెలుకుందాం.

 

0వ రోజు: క‌రోనా సోకితే వికారంగా అనిపిస్తుంది. దీనికి జీరో డే ఎందుకన్నానంటే... ఈ లక్షణం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది.


1వ రోజు: ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికి ఇతర సమస్యల్ని పెంచుతుంది. అందులో ముఖ్యంగా సో, జ్వరం వస్తే మీరు అలర్ట్ అవ్వాల్సిందే.


2వ రోజు: అలసట, పొడి దగ్గు, ఒళ్లునొప్పులు ఈ మూడు లక్షణాలూ వచ్చేస్తాయి.


3వ రోజు: అలసట, పొడి దగ్గు, ఒళ్లునొప్పులు, జ్వరం మరింత పెరుగుతాయి. 


4వ రోజు: అలసట, పొడి దగ్గు, ఒళ్లునొప్పులు, జ్వరం మరింత పెరుగుతాయి. 


5వ రోజు: ఊపిరి తీసుకోవడం కష్టం అనిపిస్తుంది.


6వ రోజు: 5వ రోజు లాగే ఉంటూ... పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా మారుతుంది.


7వ రోజు: ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పిన ల‌క్ష‌ణాలు క‌లినిస్తే మొదటి ఆరు రోజుల్లో ఆస్పత్రిలో చేరిపోవాలి. లేదంటే 7వ రోజు పై లక్షణాలన్నీ మరింత పెరుగుతాయి.


8వ రోజు: ఈ టైమ్‌  ARDS అనే సమస్య ఏర్పడుతుంది. అంటే ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి. ఇది వస్తే చనిపోయే ప్రమాదం ఉంది. అయితే 2 శాతం మందిలోనే చ‌నిపోవ‌డం జ‌రుగుతుంది.


9వ రోజు: ARDS సమస్య తీవ్రంగా మారుతుంది.


10వ రోజు: ఇక 10వ రోజు పేషెంట్‌ని ఐసీయూలో చేర్చుతారు. మ‌రియు పొట్టలో ఎక్కువ నొప్పి వస్తుంటుంది. ఆకలి వెయ్యదు. అలాగే కొంత మంది మాత్రం చనిపోతుంటారు. అయితే ఇక్కడ కూడా చనిపోయేది 2 శాతమే.


17వ రోజు: మొదటి వారంలో ఆస్పత్రిలో చేరితే... రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి, డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం పుష్క‌లంగా ఉంటున్నాయి.

 

సో..  దురదృష్టం కొద్దీ మీకు లేదా మీ కుటుంబం స‌భ్యుల‌కు ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. మొదటి 5 రోజుల్లోనే వాళ్లను ఆస్పత్రిలో చేర్చండి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ కచ్చితంగా బతికే అవకాశాలు 88 శాతం ఉంటాయి. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండండి..!!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: