దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ ఏ రేంజ్ లో ఉందో చెప్పనక్కర లేదు. ఇలాంటి సమయాల్లో బయట తిరగకుండా ఇంట్లోనే ఉండటం మనతో పాటు మన దేశానికి కూడా చాలా మంచిది. ఇప్పటి పరిస్థితులలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం కూడా ఉత్తమ ఆలోచన అని చెప్పవచ్చు. కాకపోతే ఇందుకోసం ఇప్పుడు మార్కెట్‌ లో కరోనా వైరస్ కోసం అతి తక్కువలో తక్కువ ప్రీమియంతో పలు పాలసీలు అందుబాటులో ఉంచుతున్నాయి.

 

 

ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి క్లినిక్ హెల్త్‌ కేర్ అనే సంస్థ కరోనా వైరస్ వ్యాధికి సమగ్రమైన ప్రొటెక్షన్ ప్లాన్‌ ను అందరికి అందుబాటులోకి ఆ కంపెనీ ఇందులోకి తీసుకువచ్చింది. ఈ పాలసీ కరోనా వైరస్ సోకిన వారికి వర్తిస్తుంది. ఈ కరోనా పాలసీ కొరకు సంవత్సరానికి కేవలం రూ.499 చెల్లిస్తే సరిపోతుందని కంపెనీ పేరుకొంది. అయితే మార్కెట్  లో తక్కువ ప్రీమియంతో ఈ పాలసీని అందుబాటులో సదరు కంపెనీ తెలిపింది.

 

 


ఆ క్లినిక్ హెల్త్‌కేర్ కో - ఫౌండర్ సూరజ్ బలిగ ఈ విషయంపై మాట్లడుతూ... ముఖ్యంగా కరోనా వైరస్ వల్ల ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పు పొంచి ఉందని అందుకని కొత్తగా లాంచ్ చేసిన పాలసీ వల్ల కస్టమర్లకు ప్రయోజనం ఉంటున్నదని అయన తెలియ పరిచారు. ఈ పాలసీ కరోనా సోకిన వారికి పూర్తిగా అలాగే అన్ని రకాలుగా ఉపయోగపడేలా ఈ ప్లాన్ పొందుపరిచామని  ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ పాలసీ కోసమని టోల్ ఫ్రీ నెంబర్‌ కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దీనితో ప్రజలు కరోనా వైరస్ పై ఉన్న సందేహాలు తీర్చుకోవచ్చని ఆయన తెలిపారు.

 


ఇంకా ఈ పాలసీ పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ సపోర్ట్ ప్లాన్ వల్ల ప్రైమరీ కేర్, ఫైనాన్సియల్ ప్రొటెక్షన్ అనే 2 లాభాలని పొందొచ్చు. ఇందులో కన్సల్టేషన్, 24 గంటలూ డాక్టర్ అసిస్టెంట్, రూ.1 లక్ష ఇన్సూరెన్స్ కవర్ వంటి పలు సర్వీసులు ఈ పాలసీలో పొందొచ్చు. ఈ లింక్ ద్వారా https://app.clinikk.com/  మీరు పాలసీలను కొనుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: