కరోనాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రులు ఆళ్ళ నానీ, బుగ్గన, సుచరిత, కన్నబాబు, బొత్స, డిజిపి సవాంగ్, సిఎస్ సాహ్ని, హెల్త్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో రేషన్ సరుకులు ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఏయే సరుకులు ఇవ్వాలి అనే దాని మీద చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్. 

 

ఈ సందర్భంగా బ్లాక్ మార్కెట్ కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ ఆదేశాలు జారీ చేసారు. ముఖ్యంగా రేషన్ పంపిణి విషయంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ప్రజలకు లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. సరిహద్దుల్లో చిక్కుకున్న వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేస్తామని వారికి ఏ ఇబ్బంది ఉండదు అని మంత్రి ఆళ్ళ నానీ స్పష్టం చేసారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

 

బ్లాక్ మార్కెట్ సృష్టిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేసారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తామని వాలంటీర్ల సర్వే కొనసాగుతుందని అన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల కొరత లేదన్నారు మంత్రి. సరిహద్దుల్లో ఉన్న వారి కోసం అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఉండాలని మంత్రులు సూచించారు. ఉదయం 11 గంటల తర్వాత ఎవరూ రోడ్ల మీదకు రాకుండా ఉండాలని అన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని సహకరించాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: