కరోనా వైరస్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ప్రపంచాన్ని ఏ విధంగా భయపెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ వైరస్ మొదట వూహాన్ నగరంలో బయటపడింది.  ఇది అక్కడి ఓ సీఫుడ్ మార్కెట్ నుంచి బయటకు వచ్చింది. అయితే ఈ మ‌హ‌మ్మారి అతి త‌క్కువ కాలంలోనే ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే  199 దేశాలకు ఈ కరోనా ర‌క్క‌సి వ్యాపించింది. ఇక ప్రపంచ దేశాల్లో 28,662 మంది మృతిచెందగా, 6,21,090 మందికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. ఇటలీ, అమెరికా, చైనా, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ లో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది.

 

ఇక భార‌త్‌ను సైతం ఈ వైర‌స్ అత‌లాకుత‌లం చేయ‌డం కేంద్రం ప్ర‌భుత్వం 21 పాటు లాక్‌డౌన్ విధించింది. దీంతో ప్ర‌జ‌లు ఇంటికే ప‌రిమితం అయ్యారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో గుడ్ న్యూస్ ఏంటి..? అంటే ఎండ‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ క‌రోనా వైర‌స్ చ‌చ్చిపోతుంది అనేది ప్ర‌ధానంగా జ‌రుగుతున్న ఓ ప్ర‌చారం. ప్ర‌స్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దాంతో, కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిపోతుందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. 

 

కొన్ని పరిశోధనలు ఈ విషయాన్ని చూచాయిగా ధృవీకరిస్తున్నాయి కూడా. అలాగే భారతదేశంలో కరోనా వైరస్‌ కాస్త నెమ్మదిగా వ్యాప్తి చెందుతుండడానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలే కారణమన్నది కొందరు నిపుణుల వాదన. అలాగే ఇప్పటివరకు సంభవించిన చాలా మహమ్మారులు ఉష్ణోగ్రతలు అతి తక్కువ ఉన్న ప్రాంతాలలో తలెత్తడంతో, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టవచ్చేమో అని కొందరు భావిస్తున్నారు. అయితే ఆ వైరస్‌ ఏ పరిస్థితుల్లో ఎంత సమయం సజీవంగా వుంటుందన్నదానిపై భిన్న వాదనలున్నాయనీ వైద్యులే చెబుతుండడం గమనార్హం. 

 

ఏదేమైన‌ప్ప‌టికీ.. వాతావరణ పరిస్థితులపై ఆధారపడటం కన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మేలని మ‌రికొంద‌రు నిపుణులు చెబుతున్నారు. జన సమూహాలు ఎక్కువగా ఉండకుండా చూసుకోవడం ఉత్త‌మం అంటున్నారు. మ‌రియు అంటువ్యాధులు మరింత ప్రబలకుండా లాక్‌డౌన్ మ‌రింత క‌ఠ‌నతరంగా చేపట్టాలని నిపుణులు సూచించారు. మ‌రి నిపుణులు భావిస్తున్నట్టు ఈ క‌రోనా ర‌క్క‌సి మండే ఎండ‌ల‌కు చ‌చ్చిపోతుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: