కరోనా వైరస్ తెలంగాణాలో క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఎలా అయినా సరే కఠిన చర్యలు అమలు చెయ్యాలని భావిస్తుంది. ఇక బాధితులకు ఎలాటి ఇబ్బందులు లేకుండా చూడాలని భావిస్తుంది. వైద్య సదుపాయాలను మరింతగా మెరుగు పరిచే విధంగా తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఉన్న వాటిని అభివృద్ది చేస్తుంది. 

 

ప్రస్తుతం తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 70 వరకు ఉంది. ఇవి మరింతగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆస్పత్రులను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కింగ్ కోటీ ఆస్పత్రిని కరోనా ఆస్పత్రిగా మార్చే విధంగా నిర్ణయం తీసుకుంది. 350 పడకల ఆస్పత్రిని సిద్దం చేసామని మంత్రి కేటిఆర్ కీలక ప్రకటన చేసారు. రోగులకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 

 

ఇప్పటికే గాంధీ ఆస్పత్రిని పూర్తి స్తాయి కరోనా ఆస్పత్రిగా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఇక విజయవాడ, గుంటూరు లో ప్రభుత్వ ఆస్పత్రులను కరోనా ఆస్పత్రులుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే విశాఖ, ఒంగోలులో ఉన్న ఆస్పత్రులను కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులను కరోనా ఆస్పత్రులుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: