ఒక్క చిన్న వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.. అనుక్షణం బిక్కు బిక్కుమంటూ ప్రజలను చంపేస్తున్న మహమ్మారి కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తుంది.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను అమలు చేస్తుంది.. జనతా కర్ఫ్యూ పేరుతో జనసంచారన్ని బయట తిరగనివ్వకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.. ఆయన దాని వ్యాప్తిని మాత్రం అరికట్ట లేదు... ప్రభుత్వం చేతులు దాటి పోయింది.. 

 

 

 


అయితే .. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని వ్యాప్తిని అరికట్టేందుకు భారత్‌ సహా అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. మనదేశంలో అయితే 21 రోజుల పాటు ప్రజలెవరూ బయటకు రావొద్దని ఇళ్లల్లోనే ఉండాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. నిబంధనలను అతిక్రమించి బయటకు వచ్చిన వారికి పోలీసులు లాఠీలతో సన్మానం చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తొలినాళ్లలో పదుల సంఖ్యలోనే పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు వేయికి చేరువగా వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన చాలామంది క్వారంటైన్‌కు వెళ్లకుండా నిర్లక్ష్యంగా ప్రజల్లో తిరగడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది.

 


 

 

ప్రజలకు సూచనలు చేసే స్థాయిలో ఉండే పోలీసులు, జర్నలిస్టులు కూడా కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లా డీఎస్పీ తన కుమారుడు విదేశాల నుంచి వచ్చిన విషయాన్ని దాచిపెట్టడంతో అతడి నుంచి తండ్రికి, వంట మనిషికి కరోనా వైరస్ సోకిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసింది..అలా చాలా మంది తమ అనుకున్న వారి దగ్గర నుంచే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ జర్నలిస్టు కుమార్తెకు కరోనా ఉందనే విషయాన్ని దాచి పెట్టారు దాంతో ఇప్పుడు ఆయన కూడా కరోనా ను తెచ్చుకున్నాడు.. 

 

 

 

అసలు విషయానికొస్తే...ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అతడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లండన్‌ నుంచి కూతురిని క్వారంటైన్‌కు పంపకుండా దాచడం, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తితో కలిసి నివసిస్తూ బాధ్యత లేకుండా ప్రెస్‌మీట్‌కు హాజరుకావడం తదితర నేరాలపై కేసు నమోదు చేశారు. కమల్‌నాథ్ ప్రెస్‌మీట్‌కు వచ్చిన జర్నలిస్టులు అందరూ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: