కరోనా వైరస్.. ఈ పేరు వింటేనే గజగజ వణికిపోతున్నారు.. బెదిరిపోతున్నారు.. బాబోయ్ అంటున్నారు.. అలాంటి వైరస్ అది. ఇంకా అలాంటి ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది. పుట్టింది చైనాలో అయినా బెదరకొడుతుంది మాత్రం ప్రపంచాన్ని. ఇప్పటికే ప్రపంచవ్యపథంగా 30వేలమంది మరణించారు. 6 లక్షల మంది ఈ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 

అయితే ఈ కరోనా వైరస్ మన భారత్ లోకి అడుగు పెట్టడంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలతో దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే సరుకులు, కూరగాయలకు వచ్చినప్పుడు శానిటైజర్, హ్యాండ్ వాష్ వాడకపోయినప్పటికీ.. మాస్క్ మాత్రం పక్కాగా వాడుతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ రాకూడదు కాబట్టి వాడుతున్నారు. 

 

అయితే అవి వాడాలి అనుకున్నప్పటికీ మాస్క్‌లుకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ప్రభుత్వం వీటి తయారీపై ఫోకస్ పెట్టింది. ఇంకా ఈ నేపథ్యంలోనే ఏపీలోని కొన్ని జైళ్లలోఖైదీల సాయంతో మాస్కులు తయారీ చేపిస్తున్నారు. ఈ మాస్కులు త్వరలోనే ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. 

 

నెల్లూరు జైల్లో ఖైదీలు మాస్కుల తయారు చేస్తున్నట్లు తెలిపారు.. అలా తయారు చేస్తున్న కొన్ని ఫోటోలను అయన ట్వీట్ చేశారు. కరోనా నియంత్రణ కోసం సెంట్రల్ జైల్లో ఖైదీలు తమవంతు సాయం అందిస్తున్నారన్నారు.. అంటూ అయన ట్విట్ చేశారు. అంతేకాదు కరోనా వైరస్ పై మనం అందరం కలిసి యుద్ధం చేద్దాం అంటూ ఆ మంత్రి ట్విట్ చేశారు. దీంతో ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: