కరోనా కోరలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ వైరస్ పుట్టిన దేశం అయిన చైనా కోలుకోగా.. మిగిలిన దేశాలను మాత్రం అది ఇంకా పట్టి పీడిస్తోంది... ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా పరిశీలించినట్లయితే.. 678113 మంది కరోనా బారిన పడగా.. 31748 మంది చనిపోయారు. 146319 మంది బాధితులు, కరోనా నుండి బయట పడ్డారు. మన భారత్ లో చూసుకుంటే... 987 మందికి కరోనా సోకగా... వారిలో 26 మంది  మరణించారు... 87 మంది సేఫ్ గా బయట పడినట్లు సమాచారం. ఇక మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను గమనించినట్లయితే.. తెలంగాణాలో 67 ... ఆంధ్రాలో 19 కేసులు నమోదు కాగా.. వెరసి మొత్తం.. 86 కు చేరుకుంది. తెలంగాణాలో ఒక్కరిని కరోనా కబళించింది.

 

ఒక రకంగా మన భారతదేశ పరిస్థితి కొంచెం పర్వాలేదనే చెప్పాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందస్తు చర్యలు మనకు బాగానే ఉపకరించాయి. ప్రస్తుత లాక్ డౌన్ పధ్ధతి ఇలానే స్ట్రిక్ గా కొనసాగితే.. మంచి ఫలితాలు ఉండగలవని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ప్రజలు ఇంకొంచెం బాగా సహకరిస్తే మరిన్ని సత్ఫలితాలు ఉండగలవని సూచిస్తున్నారు. 

 

ముఖ్యంగా... పలు శాఖలవారి సేవలను మనం ఎంతైనా కొనియాడాల్సిందే... డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవ ఎనలేనిది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పలువురి పారిశుధ్య కార్మికుల కాళ్ళు కడిగి, సత్కరించిన సంగతి తెలిసినదే. కొంతమంది డాక్టర్లు కరోనా బాధితులకు సేవలు చేస్తూ.. చేస్తూ.. వారే కరోనా బారిన పడుతున్నారు. ఈ విషయంలో వారు తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతున్నారు.

 

విశ్వ వ్యాప్తంగా గాని చూసుకుంటే... ఎక్కువ నష్టం పెద్దన్న అమెరికాకు జరుగుతోంది. కరోనా మహమ్మారి అక్కడ మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటికి 113677 పైగా కేసులు నమోదు కాగా... 1903 కి పైనే మరణాలు సంభవించాయని తెలుస్తోంది. దాని తరువాత ఇటలీ రెండవ స్థానంలో వుంది... 92472 పైగా అక్కడ కేసులు నమోదు కాగా... 10023 మంది బలి అయిపోయారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: