కరోనా వైరస్.. ఎంత ఘోరమైన వైరస్ ఓ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ వైరస్ బారిన ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 6 లక్షలమంది బారిన పడ్డారు. 31 వెయ్యి మంది ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. ఇంకా అలాంటి ఈ వైరస్ పై ప్రచారాలు ఎలా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఈ వైరస్ పై తెలుగులో వివిధ రకాల సామెతలు వాడుతున్నారు. ఆ సామెతలు ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

వినాశకాలే విపరీత బుద్ధి.. చైనా చేసిన పడు పనికి కరోనా పుట్టింది అని అర్ధం.. 

 

తను తీసిన గోతిలో తానే పడింది.. అందుకే అంటారు. చెడపకురా చెడేవు అని అంటారు పెద్దలు. 

 

తుమ్ముకు తమ్ముడు లేడు అనుకుంది ఇటలీ.. అందుకే చైనా వాళ్ళతో హగ్గులు.. పెగ్గులు పంచుకుంది. అందుకే నిండా మునిగింది. 

 

మన దీపం అని ముద్దాడితే మూతి కాలినట్టే.. కరోనా సంబంధించి వ్యక్తిని హగ్ చేసుకుంటే కరోనా వచ్చినట్టు అని అర్ధం. 

 

ఇంతింతై వటుడింతయై అన్నట్టు కరోనా విజృంభిస్తుంది. 

 

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఎం లాభం..  కరోనా బాగా పెరిగిన తర్వాత స్పెయిన్, ఇరాన్, ఇటలీలు ఎం చేస్తున్నాయి అని ప్రశ్నిస్తున్నారు. 

 

తూర్పు తిరిగి దణ్ణం పెట్టమని వదిలేసింది.. అనేది ఇటలీకి సంబంధించి అంటున్నారు. 

 

వెంకీ పెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్టు.. చైనా వాడు చేసిన దరిద్రం ప్రపంచ నాశనంకు వచ్చింది అని అంటన్నారు . 

 

"అ - ఆ" లు రావు గానీ అగ్రతాంబూలం నాకే అన్నట్టు.. అమెరికా వైరస్ వ్యాప్తి ఆపలేకపోయింది కానీ వ్యాక్సిన్ కనిపెడుతుంది అంట అంటూ జోకులు వేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో జోకులు పెరుగుతున్నాయి.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: