క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌పంచం అంతా లాక్‌డౌన్ చేసినా కూడా ప్ర‌జ‌లు మాత్రం రోడ్ల మీద‌కు రాకుండా ఆగ‌డం లేదు. ఎవ‌రికి వారు ఇష్ట‌మొచ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చి రోడ్ల మీద హంగామా చేస్తున్నారు. ఏదో ఒక కుంటి సాకు చూపుతూ జ‌నాలు రోడ్ల‌మీద గుంపులు గుంపులుగా క‌నిపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందు రెండు మూడు రోజులు లాక్ డౌన్ బాగా స‌క్సెస్ అయిన‌ట్టు క‌నిపిస్తున్నా ఆదివారం మాత్రం ఏదో ఒక సాకుతో బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా పాత మెడిక‌ల్ రిపోర్టులో లేదా త‌ప్పుడు మెడిక‌ల్ రిపోర్టులో చూపిస్తుండ‌డంతో ఎవ్వ‌రూ ఏం చేయ‌లేని ప‌రిస్థితి.

 

అయితే అర‌బ్ దేశాల్లో రూల్స్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే అక్క‌డ కూడా ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ఆదేశాలు ప‌ట్టించుకోకుండా రోడ్ల‌మీద‌కు వ‌స్తుండ‌డంతో ప్ర‌భుత్వం త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు భ‌య‌మూ.,. బాధ్య‌త నేర్పులా జేబుల‌కు చిల్లు పెట్టేలా దుబాయ్ ప్ర‌భుత్వం స‌రికొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తీసుకు వ‌చ్చింది. క‌రోనా క‌ట్ట‌డికి దుబాయ్‌లో స‌రికొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎవ‌రైనా బ‌య‌ట‌కు వ‌స్తే ఆటోమేటిగ్గా వారికి భారీ జ‌రిమానాలు విధిస్తారు.

 

వీళ్లు అప్ప‌టిక‌ప్పుడు జ‌రిమానా క‌ట్ట‌క‌పోయినా త‌ర్వాత అయినా క‌ట్ట‌క త‌ప్ప‌దు. లేనిప‌క్షంలో వాళ్ల‌కు ఉన్న గుర్తింపు కార్డులు.. డ్రైవింగ్ లెసెన్సుల‌తో పాటు అన్ని రకాల అర్హ‌త‌లు ర‌ద్దు చేస్తారు. ఈ నిబంధ‌న‌లు దుబాయ్ కాస్త స‌త్ప‌లితాలు ఇస్తున్న‌ట్టే క‌నిపిస్తున్నాయి. మ‌రి ఇదే త‌ర‌హా నిబంధ‌న‌లు మ‌న దేశంలోనూ.. మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ‌ర్తింప‌జేస్తే ప‌రిస్థితి మారుతుందేమో ?  చూడాలి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: