ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనా  వైరస్ భయమే కనిపిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల దేశం లోకి అడుగుపెట్టిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం స్వదేశీయులు కూడా సోకుతూ అందర్నీ ప్రాణభయంతో వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో కీలక చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఎవరు తమ తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. అంతే కాకుండా దేశ ప్రజల సహకారంతోనే ప్రాణాంతకమైన మహమ్మారిని ఓడించగలం  అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ పిలుపునిచ్చింది. అయితే దేశవ్యాప్తంగా నిర్బంధం విధించిన నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. 

 

 

 ఈ క్రమంలోనే దేశ ప్రజలందరికీ bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ గుడ్ న్యూస్ చెప్తు  దేశ ప్రజలందరిని కరోనా  వైరస్ ను నివారించేందుకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈఎంఐ  కడుతున్న వారందరూ మూడు నెలల పాటు మారటోరియం విధిస్తూ bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎంఐ లపై మూడు నెలలు మారటోరియం విధిస్తూ ప్రకటన విడుదల చేయగానే... చాలా మంది ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమైన నేపథ్యంలో.. ప్రజలు ఇబ్బంది పడకుండా bank OF INDIA' target='_blank' title='ఆర్బిఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆర్బిఐ మారటోరియం విధించటం పై  హర్షం వ్యక్తం చేశారు. 

 

 

 అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఈఎంఐ ల పై మూడు నెలల పాటు మారటోరియం విధిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. కానీ ఈఎమ్ఐ కట్టాలా వద్దా అనే దానిపై మాత్రం ప్రజలకు ఇంకా  సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అయోమయంలో ఆందోళన చెందుతున్నారు. bank OF INDIA' target='_blank' title='ఆర్బిఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆర్బిఐ మూడు నెలల పాటు మారటోరియం విధిస్తూ  నిర్ణయం తీసుకున్నప్పటికీ... పలు బ్యాంకులు, ఎన్బిఎఫ్సి సంస్థలు  తన కస్టమర్లకు ఈఎంఐ కట్టాలి అంటూ మెసేజ్ లు పెడుతున్నాయి . అయితే ఈ నెల 27న ఆర్బీఐ  ఈ ప్రకటన విడుదల చేయగా దీనిపై బ్యాంకులు మాత్రం ఎలాంటి చర్చ జరగక పోవడంతో కస్టమర్ల అందరికీ ఈఎంఐ కట్టాలి అని మెసేజ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆందోళన చెందుతున్న ప్రజలు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి అని బ్యాంకు లను  కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: