కరోనా ప్రమాదం కృష్ణా జిల్లాకు పొంచి ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కృష్ణా జిల్లాలో గన్నవరం విమానాశ్రయం ఉంది. ఇక్కడకు కనెక్టెడ్ ఫ్లైట్స్ సహా కొన్ని విమానాలు దేశ రాజధాని ఢిల్లీ, చెన్నై, ముంబై నుంచి తిరుగుతూ ఉంటాయి. ఈ విమానాలు అన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన వాళ్ళను కూడా ఎక్కించుకున్నాయి. ఇప్పుడు కరోనా బాధితులు ఎవరైనా ఉన్నారా అనేది అర్ధం కావడం లేదు. 

 

కరోనా వైరస్ సోకినా వాళ్ళు ఎవరైనా ఆ విమానాల్లో ప్రయాణం చేసారా అనేది అధికారులు ఆరా తీసినా తెలియని పరిస్థితి. ఇక విజయవాడ, గన్నవరం, బందరు సహా కొన్ని ప్రాంతాల నుంచి విదేశాలకు ఎక్కువగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బెంగళూరు, ముంబై లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. విశాఖలో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీరిలో ఎవరికి అయినా కరోనా సోకిందా అనేది అర్ధం కావడం లేదు. 

 

నందిగామ పరిసరాల్లో విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఎక్కువగా ఉన్నారు. దీనితో కృష్ణా జిల్లా యంత్రాంగ౦ అప్రమత్తమైంది. ఏ విధంగా కరోనా వైరస్ బాధితులను గుర్తించాలి అనేది అధికారులకు అర్ధం కావడం లేదు. కరోనా సోకిందా లేదా అనేది తెలియాలి అంటే కచ్చితంగా 14 రోజులు ఆగాల్సిందే. వాళ్ళు అందరూ ఎక్కడ తిరిగారు. ఎక్కడ ఎక్కడ ఉన్నారు అనేది అధికారులకు అర్ధం కావడం లేదు. కొంత మంది విదేశాల కు వెళ్లి వచ్చిన ఐటి ఉద్యోగులతో సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంత మంది చాదస్తం తో క్వారంటైన్ కూడా చేయించుకొని పరిస్థితి ఇప్పుడు ఉంది. దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో విదేశాల్లో ఉండే వాళ్ళను కూడా అధికారులు గుర్తిస్తున్నారు. త్వరలోనే వారి జాబితాను గుర్తించి బయటకు తీయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: