ఈ భారతీయులతో ఇదే రా బాధ.. బయపెట్టాం అంటే చస్తారు... లేదు అంటే విచ్చలవిడిగా తిరుగుతారు.. వీళ్ళతో ఎలా చెయ్యాలో అసలు అర్థం అవ్వడం లేదు.. వైరస్ అంత హాని కాదు.. ఎం అవ్వదు అని అంటే విచ్చలవిడిగా తిరిగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు.. అలా కాదు అని వైరస్ చాలా భయంకరం.. బయటకు రావద్దు అని అంటే.. ఎక్కడ వస్తుందో అని ముందే చస్తారు.. అసలు వీళ్ళతో ఎలా చెయ్యాలో తెలియటం లేదు కేంద్రంకు. 

 

నిజం చెప్పాలి అంటే చైనా, అమెరికా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాలతో పోలిస్తే మన భారత్ లో కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య తక్కువ అనే చెప్పాలి.. వారికీ ఉన్న తీవ్రత మనకు లేదు.. ఆ దేశాల్లో కరోనా బారిన పడి మృతి చెందినట్టు ఇక్కడ మరణించడం లేదు.. అలా చెప్పకుండా.. మన దేశంలో విజృంభిస్తుంది.. నిన్నటికి నిన్న దేశవ్యాప్తంగా వందమందికిపైగా వ్యాధి బారిన పడ్డారు అంటే ఆత్మహత్య చేసుకుంటారు. 

 

నిజం చెప్పాలి అంటే మన దేశంలో రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుంది.. కానీ నిజానికి ఈ వైరస్ ను ప్రస్తుతం మనం కంట్రోల్ చేసే సిట్యుయేషన్ లో నే ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ఇళ్లలో ఉంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చెయ్యచ్చు. అలా కాదు అని విచ్చల విడిగా తిరగం వంటి పనులు చేస్తే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించలేం.. 

 

అయితే ఈ వైరస్ కోసం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు.. దీనికి కేవలం వ్యాక్సిన్ లేదు అంతే.. కానీ ఈ వైరస్ బారి నుండి బయట పడగలం.. ఎంతోమంది వైరస్ పాజిటివ్ తో ఆస్పత్రిలో చేరి నెగటివ్ తో బయటపడుతున్నారు. కేవలం 60.. 70 ఏళ్ళు పైబడిన వారు మాత్రమే మృతి చెందుతారు తప్ప.. ఈ వ్యాధి ప్రమాదకరమైనది అంటే ప్రమాదకరం అని.. లేదు అంటే లేదు అనే చెప్పాలి. అయితే ఈ వైరస్ వల్ల ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం అసలే లేదు.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: