కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా అన్న సంగతి అందరకీ తెలుసు. చైనాలోని వుహాన్ నగరం నుంచి ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. అయితే అది ప్రపంచానికి పాకడానికి ఓ చైనా వేడుక కారణమన్న అంశం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. చైనాలోని వుహాన్ మాంసపు మార్కెట్లలో జీవం పోసుకున్న కరోనా వైరస్ గురించి మొదట్లో చైనా వాళ్లే పెద్దగా పట్టించుకోలేదు. చాలా లైట్ గా తీసుకున్నారు.

 

 

కానీ ఒక్కసారి కరోనా వైరస్ సీరియస్ నెస్ అర్థమయ్యాక మాత్రం చాలా గట్టి ప్రయత్నాలు చేసింది చైనా. అయితే ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా పాకడానికి చైనా సంప్రదాయ కొత్త సంవత్సర వేడుకలు కూడా కారణం అన్న కథనం వినిపిస్తోంది. ఎందుకంటే.. సరిగ్గా ఈ వేడుకకు కొన్ని రోజుల ముందే వుహాన్‌ లో కరోనా వైరస్ ప్రాణం పోసుకుంది. అది వుహాన్‌లోని చైనీయులకు వ్యాపించింది. చైనా వాళ్లు దాని ప్రభావం గుర్తించి చర్యలు తీసుకునేలోగా వాళ్ల కొత్తసంవత్సర వేడుక వచ్చింది.

 

 

చైనా వాళ్లు న్యూఇయర్ వేడుకను ఘనంగా చేసుకుంటారు. అందులోనూ ఈ సందర్భంగా సెలవులు కూడా బాగా పెడతారు. ఇంతలో ఈ వేడుకకు రెండు రోజుల ముందు వుహాన్‌ను లాక్‌డౌన్‌ చేశారు. కంటి వైద్యుడొకరు ఈ వైరస్‌ గురించి సోషల్‌ మీడియాలో పంచుకుంటే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు చెప్పిన సమయంలోనే ఈ సూక్ష్మక్రిమి వుహాన్‌ మొత్తం వ్యాపించింది. ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించినా అక్కడి ఆస్పత్రులు పట్టించుకోలేదు.

 

 

కొత్త ఏడాది వేడుకల సందర్భంగా సెలవులు రావడంతో చాలామంది చైనీయులు విదేశాలకు వెళ్లారు. ఇటలీ, స్పెయిన్‌, అమెరికా, బ్రిటన్‌ సహా ఎన్నో దేశాలకు చేరుకున్నారు. చైనీయులు, స్థానికులు అక్కడ సమూహాలతో కలసి కరోనాను విశ్వవ్యాప్తం చేసేశారు. సో.. ఈ చైనా వేడుకే కరోనా ఇంత వేగంగా వ్యాపించడానికి పరోక్షంగా కారణమైందన్న వాదన వినిపిస్తోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: