యావత్ భారత దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించటంతో ఇంటికి పరిమితం అయ్యారు. ఈ సమయంలో కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై తన జీవిత పాఠాలను మనతో పంచుకుంటున్నారు. ఓ నవదంపతులు వారోలోకి ఓ కొత్త బిడ్డను ఆహ్వానించటం వారికి ఒక గొప్పవరం. అలాగే.. ఈ విషయం మన జీవితాలలో కొత్త వెలుగును నింపుతుంది. అదే సమయంలో వారిని పెంచడం మన మీద ఉన్న అతి పెద్ద బాధ్యత. వారి కోసం మన సమయాన్ని త్యాగం చేయాలి. వారు ఏడిస్తే ఓదార్చడానికి మనం ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రులతో ఉండే సమయం తగ్గిపోతోంది. పిల్లలతో సమయం గడపలేకపోతున్నామనుకునే తల్లిదండ్రులకు, తల్లిదండ్రులకు దూరంగా ఉండే పిల్లలకు ఇదో క్లిష్ట సమయం అని చెప్పవచ్చు. ఐక్యరాజ్యసమితి హౌస్ హోల్డ్, కంపోజిషన్ రిపోర్ట్ 2019 ప్రకారం దంపతులు, పిల్లలతో కలసి ఉండే దంపతుల కుటుంబాలు భారతదేశంలో 50 శాతం వరకు ఉన్నాయి. ఇక 37 కుటుంబాల్లో మాత్రమే తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మలతో కలిసి ఉంటున్నారు. పట్టణీకరణ పెరుగుతోంది. అమ్మమ్మ,నానమ్మ, తాతయ్యలతో ఆదుకునే అవకాశం లేదు ఇప్పటి పిల్లలకు.    

 

బాల నేరస్తులకి, విడిపోయిన కుటుంబాలకి మధ్య దగ్గర సంబంధం ఉంది. విడిపోయిన కుటుంబాలు పిల్లల్ని సరిగా పెంచలేవు. ఇక ఆ సమయంలోనే పిల్లలు వారికీ యేదనిపిస్తే అది చేసుకుంటూ పోతారు. 2013లో కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ ఓ సర్వే నిర్వహించింది. 2500 మంది బాలనేరస్తులను సర్వే చేస్తే అందులో 94 శాతం మంది తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండానే పెరిగినట్టు వారు గుర్తించారు. ఒంటరిగా పెరగడం, తల్లిదండ్రుల సమక్షంలో జాగ్రత్తగా పెరగడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దీంతో చాలా మంది పిల్లలు సరైన అవగాహన లేకుండా ప్రవర్తిస్తుంటారు. తల్లిదండ్రుల దగ్గర ఉండే పిల్లలు తమ పిల్లలకు ఏం కావాలనేది వారి యొక్క తల్లిదండ్రులకు తెలుసు. దానికి తోడు వారి పెంపకంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. దీనికి ఆరంభంగా EEE (Exposure, Educate and Empower) ఫార్ములాను ఉపయోగించి మరింతగా పిల్లలను సమర్థవంతంగా చేసేందుకు వారి తల్లితండ్రులు ఇన్వాల్వ్ అయ్యి పెంచాలి. 

 

ప్రతి పిల్లలకు పెరుగుతున్న సమయంలో బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలిసిన అవసరం ఎంతైనా ఉంది. ఏది మంచి ఏది చెడు అనే విషయాలపై అవగాహన చాలా అవసరం. పిల్లలకు చదువే కాకుండా వారు బయట జరిగే విషయాలు కూడా తెలిసేలా చేయాలి. డబ్బు ఉన్న వాళ్లు ఎలా జీవిస్తున్నారనేది కాక మధ్య తరగతి కుటుంబాల సమస్యలు కొన్నైనా తెలిసేలా మనం చూపించాలి. అలాగే నిరుపేద కుటుంబాల ఆకలి కేకలు చూడాలి. రకరకాల విషయాలను గమనించాలి. పిల్లలను పొద్దున్నే లేపి ట్యూషన్ తర్వాత ఇతరీతర క్లాసులు తర్వాత స్కూల్ ఇంటి కొచ్చాక మల్లి డాన్స్ క్లాస్ మల్లి ట్యూషన్ ఇలా వాళ్ళకి ఖాళీ సమయం దొరకకుండా చేస్తున్నాము. ఇలా చేయటం సరికాదు. వారికి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేంత దైర్యం, తెలివి నేర్పించటం అవసరం.

 

పిల్లలకు చదువుతో పాటుగా , ధైర్యం, దయ, జాలి ఇలాంటి గుణాలను నేర్పించాలి. ఇది కేవలం ఒక్క తల్లిదండ్రుల వలనే అవుతుంది. విద్య అనే దానికి భిన్న కోణాలు ఉన్నాయి. ఒకటి మనం మనకి ఊహ వచ్చినప్పటి నుంచి నేర్చుకున్నవయితే, మరొకటి ఎకాడమిక్ నుంచి నేర్చుకున్నవి అంటే.. సైన్స్, చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం. ప్రస్తుత మన సమాజంలో సరిపడా ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు. కానీ బాధ్యతగా నిలబడటం లేదు. పైన మనం అనుకున్న నిజాయితీ, భయం, దైర్యం ఇలాంటివి లేవు. మనకి ఎదైనా అన్యాయం ఆఫీస్ లో జరిగిందనుకోండి కనీసం మనం మన పై ఆఫీసర్లకు ఎదురుతిరగలేనప్పుడు, మనం ఒప్పు అనుకొన్న దాని గురించి చెప్పలేనప్పుడు ఇక తల్లిదండ్రులు పిల్లలకు ఏం నేర్పుతారు..? ఇక్కడ విద్య అంటే కేవలం బోధన మాత్రమే కాదు. మన రోజువారీ జీవితంలో ఆదర్శంగా నడవడం. అప్పుడు మన పిల్లలు మన నుంచి ఏం నేర్చుకుంటారు.

 

మీ పిల్లలకు సరైన సమయం వచ్చినపుడు వారిని వారిగానే ఎదగ నివ్వండి. ఉదాహరణకు ఒక చిన్న పక్షిని తీసుకుందాం అది పెద్దయిన తర్వాత ఎగరాలి, దానికదే ఆహరం ఏర్పాటు చేసుకోవాలి. అవి పెద్దయ్యాక బయటికి వెళ్లాలంటే ఎగరాలి. అది అప్పటివరకు ఎగిరాడు కాబట్టి దానికి భయం వేస్తుంది. ఆ సమయంలో తల్లి పక్షి ఆ పిల్ల పక్షిని బయటకు నెడుతుంది. అలాగే ఆ బిడ్డ బ్రతకడానికి అదే ప్రధానం. మీ పిల్లలకు మీరు కూడా మార్గ మార్గనిర్దేశాన్ని, నమ్మకాన్ని కల్పించటం అవసరం. వీలైనంత సేపు వారికి మంచి మార్గాన్ని వెతుక్కోవటానికి సహాయం చెయ్యండి. కొన్ని కొన్ని సందర్భాలలో వారి ఛాయిస్ ప్రకారమే వెళ్లనివ్వండి. వారికి ఎక్కడైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు వారికి మనం వెన్నుతట్టి ప్రోత్సహిస్తే వారే దైర్యంగా పైకి ఎదుగుతారు. మనం వారికి అంతకంటే ఎక్కువ ఇవవల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: