ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 6, 80, 696 నమోదు కాగా... మరణాల సంఖ్య 31, 920 చేరుకుంది. కోవిడ్ 19 వ్యాధి నుండి నయం కాబడిన వారి సంఖ్య 1, 46, 396. ఇకపోతే కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో భారతదేశంలో ఆకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించేసరికి వలస వచ్చిన లక్షల మంది రోజువారి కూలీలు ఉపాధి లేక, ఇళ్లలేక రోడ్ల పాలయ్యారు. ముందే ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో లక్షల మంది వలస కూలీలు ఒకేసారిగా గుంపులుగా ఏర్పడటం జరుగుతుంది.



భారతదేశంలో ఇప్పటివరకు 987 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా... ఈరోజు ఒక కొత్త మరణంతో 26 కి మరణాల సంఖ్య చేరుకుంది. మహారాష్ట్రలో 196 కేసులు నమోదు కాగా వారంతా విదేశాల నుండి వచ్చిన వాళ్ళు మాత్రమేనని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ తాజాగా తెలియజేశారు. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో ఆర్మీ జవాన్లు ఇల్లు లేక రోడ్లపై నివసిస్తున్న ప్రజలకు ఆహారం అందించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తూ... ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ ద్వారా కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులకి చికిత్స చేస్తున్న డాక్టర్లు కోవిడ్ 19 వ్యాధి కారణంగా చనిపోతే వారికి రూ. 50 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని తెలియజేసింది.



గవర్నర్ జగదీష్ దంఖర్ మాట్లాడుతూ... కేంద్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 10, 000 కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లని పంపించిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వైయస్సార్ సిపి ఎమ్మెల్యే బంధువుకి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలడంతో అతనితో పాటు మరో 14 బంధుమిత్రులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు అధికారులు. ప్రస్తుత పర్యవేక్షణలో ఎమ్మెల్యే ముస్తఫా తో పాటు మరో ఆరుగురికి వ్యాధి లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే... మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో... ఈరోజు 11 మందికి కోవిడ్ 19 నెగిటివ్ వచ్చిందని తెలియజేశారు. దాంతో ప్రస్తుతం ఉన్న 67 కేసుల నుండి 56 కేసులకు కరోనా బాధితుల సంఖ్య తగ్గిపోయింది.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: