కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటి వరకు ఒక స్థాయి వరకు ఉన్న పరిస్థితి ఇప్పుడు మరింతగా దిగాజారినట్టే కనపడుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటలీ అమెరికా స్పెయిన్ దేశాలు ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వైరస్ ని ఏ విధంగా కట్టడి చెయ్యాలి అనేది ఇప్పుడు ఎవరికి అర్ధం కావడం లేదు. అమెరికా అయితే దాదాపుగా చేతులు ఎత్తేసినట్టే కనపడుతుంది. అక్కడ దాదాపు అనధికారికంగా రెండు లక్షల మందికి సోకింది. 

 

ఇప్పటి వరకు అక్కడి పభుత్వంలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చెయ్యాలని ప్రపంచం సూచనలు చేసినా ప్రభుత్వం మాత్రం మారడం లేదు. అన్ని రాష్ట్రాల మధ్య విమానాలు స్వేచ్చగా తిరుగుతున్నాయి. ఎక్కడ ఆర్ధిక పరిస్థితి దిగజారకుండా ఉండాలి అంటే లాక్ డౌన్ ని ప్రకటించకుండా ఉండాలని అమెరికా భావిస్తుంది. అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం చూపిస్తుంది. ప్రతీ ఇంటిలో ఒకరికి కరోనా వైరస్ ఉందని అంటున్నారు. అక్కడ కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో ట్రంప్ ఎవరి మాట వినడం లేదని అంటున్నారు. 

 

ఇది పక్కన పెడితే స్పెయిన్ లో ఇప్పుడు కరోనా మరింత వేగంగా విస్తరిస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి స్పెయిన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇటలీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటలీ లో ఇప్పటి వరకు 11 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్ లో ఆరు వేల మంది కరోనా కారణంగా మరణించారు. అదే విధంగా అమెరికాలో మూడు వేల మంది వరకు అధికారికంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి దాదాపుగా దిగజారిపోయింది. ఈ దేశాలు మందు ఉంటే మినహా దాన్ని కట్టడి చేయలేవు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: