దేశంలో కరోనా ని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. దేశంలో రోజు రోజు కీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశంలో 25 కేసులు నమోదు అయినట్లు చెబుతున్నారు.  900 లకు పైగా ఈ కరోనా బారిన పడ్డట్టు సమాచారం.  కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.

 

నగరంలో ఉన్న రైతు బజార్లలో రద్దీ పెరగడంతో కరోనా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతు బజార్లకు వినియోగదారులు రాకుండా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మొబైల్‌ రైతు బజార్లలో మాత్రమే తాజా కురగాయాలు కొనుగోలు చేయాలని మేయర్‌ విజ్ఞప్తి చేశారు.  ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 145 మొబైల్ రైతు బజార్లను ప్రారంభించామని, భవిష్యత్ లో వీటి సంఖ్య మరింత పెంచుతామని చెప్పారు. 

 

ప్రతిరోజు చాలా మంది కూరగాయలు ఇతర అవసరాలు ఉన్నాయంటూ రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్నారు.  వారిని కట్టడి చేయలని పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నారు.. లాఠీ చార్జి కూడా చేస్తున్నారు.  ఇక మొబైల్ రైతు బజార్లను వల్ల తమ ఇళ్ల వద్దకే కూరగాయలు సప్లై చేస్తారని.. సరసమైన రేట్లకే అమ్ముతారని అన్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: