సమస్యలతో నిద్రపట్టడం లేదని కొందరు చెప్పటం మనం అందరం వింటునే ఉంటాం. అటువంటి సమస్యేమైనా పచ్చమీడియా అధినేత వేమూరి రాధాకృష్ణకు కూడా ఉందేమో అని అందరికీ  అనుమానం వస్తోంది.  వేమూరికి  జగన్మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకుందేమో అని అందరికీ అనుమానంగా ఉంది. అందుకనే ప్రతి ఆదివారం తాను రాసే చె(కొ)త్తపలుకులో  జగన్ గురించి నెగిటివ్ గా రాయనిదే వేమూరికి నిద్ర పట్టదేమో అని అనుమానంగా ఉంది.

 

ఈ ఆదివారం చెత్తపలుకులో రాసిందేమిటయ్యా అంటే కొరోనా మహమ్మారిని గుర్తించటానికి కూడా జగన్ కు మనసు రావటం లేదట. కొరోనా వైరస్ తీవ్రతను గుర్తించేందుకు జగన్ అంగీకరించటం లేదట. ఇప్పటికి కూడా జగన్ ఈ వైరస్ ప్రమాదానని సీరియస్ గా తీసుకోలేదట. ముప్పును గుర్తించటానికి ఇష్టపడని వారి నుండి ఇంతకన్నా మెరుగైన చర్యలను ఆశించలేమని ఆర్కె తీర్పిచ్చేశాడు. జగన్ గురించి కేసియార్ మాట్లాడుతూ జగన్ ఎవరి మాట వినడని, మొండివాడని ఉత్తర కొరియా నియంత లాంటి వాడు  అని అన్నాడట.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసియార్ పలానా వారితో జగన్ గురించి కామెంట్ చేశాడని ఏ ఒక్కరోజు కూడా వేమూరి రాయలేదు. ఎప్పుడు జగన్ గురించి కేసియార్ కామెంట్ చేశాడని రాసినా తన సన్నిహితులతో అన్నాడని మాత్రమే రాస్తాడు. ఎందుకలా అంటే రాసేదంతా చెత్తే కాబట్టి. తాను రాసిన వాటికి ఆధారాలుండవు కాబట్టే. నిజంగానే జగన్ గురించి కేసియార్ ఎవరితో అయినా అనుంటే ఎక్కడన్నాడో,  ఎవరితో అన్నాడో కనీసం ఒక్కసారైనా రాసుంటే చెత్తపలుకుకు విశ్వసనీయతుండేది.

 

ఇక వైరస్ తీవ్రత విషయమే తీసుకుంటే మొదట్లో కొరోనాను జగన్ తేలిగ్గా తీసుకున్న మాట వాస్తవమే. ఎందుకంటే అప్పట్లో వైరస్ ప్రమాదం ఇపుడున్నంత సీరియస్ గా లేదు. ఎప్పుడైతే వైరస్ ప్రభావం పెరుగుతోందని అనుకున్నాడో వెంటనే అలర్టయ్యాడు. కాబట్టే గ్రామ, వార్డు వాలంటీర్లు 2.5 లక్షల మంది  రంగంలోకి దిగేశారు. ఇంటింటి సర్వే మొదలుపెట్టారు. పనిలో పనిగా విదేశాల నుండి వచ్చిన వాళ్ళపై ఓ కన్నేశారు. ఐసొలేషన్ వార్డులు, క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశాడు.

 

ప్రతిరోజు ఉన్నతాధికారులతో సమీక్షలు చేస్తున్నాడు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాడు. జగన్ సమర్ధవంతంగా పనిచేస్తున్నాడు కాబట్టే రాష్ట్రంలో 19 కేసులు మాత్రమే నమోదయ్యాయి. జగన్ తీసుకుంటున్న నియంత్రణ చర్యలను అందరు అభినందిస్తుండటంతో పచ్చమీడియా తట్టుకోలేకపోతోంది. అందుకనే కళ్ళెదుట కనిపిస్తున్న వాస్తవాలను గుర్తించటానికి కూడా మనసు రాకే చెత్త రాతలు రాస్తున్నది.

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: