క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19) ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ మొత్తం వ్యాపించి.. అనేక మంది ప్ర‌జ‌ల‌ను బ‌లితీసుకుంటుంది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం విధించిన 21 రోజులు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో పనులు లేక తమ సొంత రాష్ట్రాలకు వలస కూలీలను పయనమవుతున్నారు. అయితే  లాక్‌డౌన్ నేప‌థ్‌యంలో వలస కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. రోడ్డుపై వాహనాలకు అనుమతి లేకపోవడంతో కాలినడకనే కార్మికులు వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు.

 

ఇక తాజాగా మధ్యప్రదేశ్లోని తన ఇంటికి చేరుకోవడానికి ఢిల్లీ నుండి ఏకంగా 200 కిలోమీటర్ల దూరం నడిచిన 38 ఏళ్ల వ్యక్తి దారిలో మరణించాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  మధ్యప్రదేశ్‌కు చెందిన రణవీర్ సింగ్(39) ఢిల్లీలోని ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా పని లేకుండా పోయింది. చేతిలో డబ్బు లేదు, ఆశ్రయం పొందడానికి అవకాశం లేదు. దాంతో తన స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే రైళ్లు, బస్సులు రద్దు కావడంతో రణ్‌వీర్ సింగ్ దేశ రాజధాని నుండి 326 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని తన గ్రామానికి నడవడం ప్రారంభించాడు. అలాగే లినడకన బయలుదేరిని వ్యక్తి దాదాపు 200 కిలోమీటర్లు మేరా నడిచి ఢిల్లీ - ఆగ్రా హైవేపై ఒక్కసారిగా కుప్పకూలాడు. 

 

అదే టైమ్‌లో రణ్‌వీర్‌తో పాటు మరో ఇద్దరు ఢిల్లీకి చెందినవారు మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలోని తన గ్రామం వైపు నడిచారు. వారు ఆగ్రా చేరుకునే సమయానికి రణవీర్ కి ఛాతీ నొప్పి రావడంతో ముగ్గురూ ఆగ్రా శివార్లలో ఆగిపోయారు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చి వాళ్లు వచ్చేలోపు ర‌ణ్‌వీర్‌ చనిపోయారు. ఇక అత‌డు మృతి చెందిన‌ట్టు గుర్తించిన పోలీసులు పోస్టుమార్ట‌ం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫార్మాలిటీ పూర్తయిన తర్వాత అతని కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు. కాగా, మ‌రోవైపు వలస కార్మికులపై ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ ప్రభుత్వాలు శనివారం స్పందించి ప్రజలను ఇంటికి తీసుకెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేశాయి. సుమారు 1,000 బస్సులను ఏర్పాటు చేసినట్లు యుపి ప్రభుత్వం వెల్ల‌డించింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: