కరోనా వైరస్ ప్రపంచ దేశాలలో అల్లా కల్లోలం సృష్టిస్తుంది. ఈ వైరస్ మన దేశంలో శరవేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే మన దేశంలో 1000పైగా కరోనా కేసులు నమోదైయ్యాయి. ఇకపోతే భరత్ లో కరోనా కారణంగా 20మంది చనిపోయారు. మన దేశంలో మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైయ్యాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా కేసు నమోదైయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో కరోనా కేసులు తక్కుగానే నమోదైయ్యాయి.

 

ఏపీలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. అయితే తాజాగా అక్కడి ప్రభుత్వం కరోనా పై బులెటిన్‌ విడుదల చేశారు. అయితే ఈ బులెటిన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపారు. ఏపీలో ఎక్కువగా విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాలుగు కరోనా కేసులు నమోదైయ్యాయి. మిగతా జిల్లాలైన ప్రకాశంలో మూడు కరోనా కేసులు, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు కరోనా బాధితులు ఉన్నారని అధికారులు తెలిపారు.

 

 

వైద్యులు 60మంది కరోనా అనుమానితుల నమూనాలను సేకరించారు. వైద్యులు ఆ నమూనాలను టెస్ట్ చేసి అందులో 16మందికి కరోనా నెగిటివ్ గా ఉన్నట్లు డాక్టర్స్ నిర్దారించారు. మిగత వారు  నమూనాల రిజల్ట్ కోసం కాస్త వెయిట్ చేయాలని డాక్టర్స్ ఈ సందర్బంగా తెలియజేశారు. అయితే ఏపీలో విదేశాల నుండి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారన్నారు. వారిని  ఐసోలేషన్‌లో ఉంచి వల్ల బాగోగులు చూస్తున్నట్లు తెలిపారు. అయితే అందులో 195 మందిని ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు.

 

ఏపీలో కరోనాను కొంత వరకు అయినా కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఏపీ ప్రభుత్వం విదేశాల నుండి వచ్చే వారిపై నిఘా పెట్టారు. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ అనవసరంగా బయటికి వచ్చిన వారికీ పోలీసులు బుద్ధి చెప్పి ఇండ్లకి పంపిస్తారు. అటు నిత్యావసర వస్తువులకు కూడా సమయాన్ని కేటాయించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: