కరోనా వైరస్ విజ్రంభిస్తున్న వేళ, దాన్ని అరికట్టటం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలు వివిధ రకాల వ్యూహ రచనలు... చర్యలను చేపడుతున్నాయి. అందులో భాగంగానే.. మన కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ అనే పద్ధతిని ప్రవేశ పెట్టి, విజయవంతంగా కార్యాన్ని జరుపుతోంది. దీనికి మద్దతుగా పలువురు ప్రముఖులు అయిన వ్యాపారస్తులు, రాజకీయ వేత్తలు, క్రికెటర్లు, సినిమా తారలు వారికి తోచినంతలో సాయాన్ని అందిస్తున్నారు.

 

ఇపుడు ఆ కోవలోకి చేరారు... మన ఇండియన్ రైల్వే ఉద్యోగులు.. తమ ఒక్క రోజు జీతం రూ. 151 కోట్లు విరాళాన్ని, పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఇస్తున్నట్లుగా.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆదివారం, అనగా ఈరోజు... ట్విటర్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసారు. సదరు విషయం తెలిసిన ప్రధాని మంత్రి మోడీ... రైల్వే ఉద్యోగులను ప్రశంసించారు.

 

 

ఆ ప్రకటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఈ విధంగా ప్రస్తావించారు... ‘మన ప్రియతమ నేత  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నేను, ఇంకా.. రైల్వే శాఖ సహాయ మంత్రి అయిన సురేష్‌ అంగాడిల నెల జీతం, అలాగే 13 లక్షల మంది రైల్వే, పీఎస్‌యూ ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతనం మొత్తం 151 కోట్లను... కరోనా కట్టడికి సాయంగా ఇస్తున్నాం.. అని తెలిపారు.

 

ఇంకా... పీయూష్‌ గోయల్‌ రాస్తూ... ప్రస్తుతం కరోనా దేశాన్ని కబళిస్తున్న తరుణంలో... తమవంతు సాయం చేయడానికి ముందుకొచ్చిన తోటి ఉద్యోగులకు ఈ సందర్భంగా అయన కృతజ్ఞలు తెలియ జేశారు. దేశం సుభిక్షంగా ఉండటం కోసం వారు ఇచ్చిన ప్రతి రూపాయి ఒక్కో సమిధ అని కొనియాడారు. ఇకపోతే... ఇటీవల పలువురు నేతలు... సెలిబ్రిటీస్... కోట్లలో విరాళాలు ప్రకటించిన విషయం తెలిసినదే.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: