కరోనా వైరస్.. ఎంత బయంకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 31వేలమందికిపైగా మృతి చెందారు. ఇంకా ఈ వైరస్ కారణంగా 6 లక్షల మంది ఆస్పత్రిపాలై చిత్స పొందుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చేసి పడేసింది. 

 

దీంతో ఈ భారత ప్రభుత్వం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరుకు ప్రజలు ఎవరు ఇంటి నుండి బయటకు రాకూడదు అని సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే మన భారత్ లో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య వెయ్యిమంది దాటగా మృతుల సంఖ్య 27కు చేరింది. అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే? కరోనా కేసులు పాజిటివ్ అయినప్పటికీ.. పాజిటివ్ వచ్చిన వారిని నెగటివ్ రిపోర్ట్ వచ్చేలా ఆరోగ్యశాఖ శ్రమిస్తోంది. 

 

అయితే తెలంగాణాలో మాత్రం కరోనా వైరస్ నయమైనప్పటికీ వారిని పంపడం లేదు.. ఎందుకంటే కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి .. అలాంటి ఈ సమయంలో కరోనా వైరస్ నయమైనప్పటికీ పంపడానికి డాక్టర్లు తొందర పడటం లేదు.. ఎందుకంటే కరోనా వైరస్ నెగటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ మరో 9 రోజులు వారి శరీరంలో ఉంటుంది అని ఓ అధ్యయనం చెప్తుంది. అలాంటి ఈ సమయంలో కరోనా వైరస్ నయమైంది అని పంపితే మరి తిరగబడితే కష్టం అనే కారణంగా కొద్దీ రోజులు ఆస్పత్రిలోనే ఉంచుతున్నారు. 

 

కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గిన తర్వాత నెగటివ్ వచ్చిన వారిని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్తున్నారు. అంతేకాదు.. ఒకసారి ఒకరు ఇద్దరినీ డిశ్చార్జ్ చెయ్యడం కంటే కూడా.. ఒకేసారి పది.. పన్నెండు మందిని డిశ్చార్జ్ చేయటం మంచిది అని... దీని వల్ల ప్రజలలో దైర్యం పెరుగుతుంది అని చెప్తున్నారు.. ఏది ఏమైనప్పటికి కొద్దీ కాలం కష్టం అయినా వారు ఆస్పత్రిలో ఉండటమే మంచిది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: