కరోనా నేపధ్యంలో ప్రపంచంలో ఎవరు ఊహించని సంఘటనలు రోజు రోజుకు జరుగుతున్నాయి.. ఏ క్షణం ఏ వార్త వినవలసి వస్తుందో అనే భయంతో ప్రజలంతా బ్రతుకుతున్నారు.. ఒక రకంగా మానసిక ధైర్యం కోల్పోయి జీవిస్తున్నారు.. ఇప్పటికే ప్రభుత్వాలు సాధ్యమైనంత వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి..

 

 

ఇకపోతే కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఈ వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలియజేశారు.. ఇందులో భాగంగా ఇళ్లలో నుంచి జనాలను రానివ్వడమే కాకుండా.. క్వారంటైన్‌లో ఉన్నవాళ్లు, విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో నిత్యావసరాల కొనుగోలు విషయంలో కొంతమంది నిపుణలు ఇచ్చిన సూచనల మేరకు ఉదయం 11 గంటల తర్వాత ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు.. వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

 

 

అయితే గ్రామీణ ప్రాంతాల్లో జనాలకు మాత్రం నిత్యావసరాల కొనుగోలుకు మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఇచ్చామని, కానీ నిత్యావసరాల కోసం ప్రజలంతా ఒక్కసారిగా బయటకు రావొద్దని, ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే రావాలని సూచించారు.. ఇక దోచుకోవడానికి ఇదే అదనుగా భావించి మార్కెట్లు, షాపుల్లో నిత్యావసరాలు, కూరగాయలు ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

 

అంతే కాకుండా నిత్యావసరాల విక్రయాలపై కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, ప్రతి షాపు దగ్గర వస్తువుల ధరల పట్టిక ఏర్పాటు చేయాలని  సీఎం జగన్‌ సూచించారన్నారు.. అదీ గాకుండా రైతులు, వ్యవసాయ కూలీలకు ఇబ్బంది లేకుండా చూస్తామని, వ్యవసాయ ధరలు పడిపోకుండా.. మొబైల్స్‌ మార్కెట్స్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.. కాబట్టి ప్రజల్లారా కరోనా కట్టడికి సహకరించండి.. ఈ రాక్షసిని తరిమికొట్టండి.. ఎవరు నిర్లక్ష్యంగా ఉన్న కరోనాకు తమ ప్రాణాలను మూల్యంగా ప్రతి వారు చెల్లించుకోక తప్పదని గ్రహించండి..

మరింత సమాచారం తెలుసుకోండి: