మన దేశంలో కరోనా పుణ్యమా అని ఆకలి కేకలు ఎక్కువగా వినపడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మన దేశంలో జనాభా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో కుటుంబంలో పది మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఇది ఎక్కువగా ఉంటుంది. దక్షిణ భారత దేశంలో పిల్లలు ఉన్న వాళ్ళు తక్కువే గాని అక్కడ అయితే కుటుంబంలో పది మంది పిల్లలు ఉండి వాళ్ళు మరో పది మందిని కానీ 50 నుంచి 60 మంది పిల్లలు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అక్కడ బంగాళ దుంపలు తిని బ్రతికే కుటుంబాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. 

 

ఇప్పుడు కరోనా దెబ్బకు ఎవరికి పనులు ఉండటం లేదు. చాలా మంది ఇప్పుడు ఆకలి కేకలతో ఇంట్లోనే ఏ ఉపాధి లేకుండా ఉంటున్నారు అనేది అర్ధమవుతుంది. మన దేశం లో ఆకలి కేకలు ఎప్పటి నుంచో ఉన్నా అది కుటుంబ వ్యవస్థలో చాలా తక్కువ. పిల్లలు పెద్దలు అందరూ ఏదోక పనికి వెళ్లి పోషించుకుంటూ ఉంటారు. కాని ఇప్పుడు లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యం లో అది సాధ్యం కావడం లేదు. ఎవరికి కూడా పని అనేది ఉండటం లేదు అనే చెప్పాలి. దీనితో ఇప్పుడు భారీగా దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ దొంగతనాలు ఎక్కువగా కనపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఇవి ఆగే అవకాశం ఉండదు అని రాబోయే మూడు నెలల్లో పెద్ద పెద్ద ఇళ్ళ మీద దొంగలు పడటం ఖాయమని అంటున్నారు. అదే విధంగా కొందరు అయితే నిత్యావసర సరుకులు దొరికే కిరాణా షాపుల్లో కూడా దొంగతనాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: