ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6, 83, 694 కి చేరుకోగా... ఇప్పటివరకు 32, 155 మంది కరోనా వ్యాధి లక్షణాలతో మృత్యువాతపడ్డారు. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి తాజా విశేషాలు తెలుసుకుంటే... కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ... ఈరోజు కొత్తగా 20 కేసులు నమోదయ్యాయని, మొత్తం కలిపి ఇప్పటివరకు 181 కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులు తరలించే అంబులెన్సు డ్రైవర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఒక ప్రత్యేకమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తెరపైకి తెచ్చింది.


అలాగే కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులు ప్రయాణిస్తున్న అంబులెన్స్ లని గుర్తించేందుకు అంబులెన్స్ సిబ్బంది కూడా ఒక ప్రత్యేకమైన అవగాహన కల్పించే చర్యలను చేపడుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులోని భాగంగా '102' అంబులెన్సులను కోవిడ్ 19 రోగులను తరలించేందుకు ఉపయోగించకూడదని... ఆ అంబులెన్సులను కేవలం గర్భవతులను, జబ్బుపడిన ప్రజలను మాత్రమే తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ టెక్నీషియన్లు శక్తివంతమైన మాస్క్ లను, ఇంకా ఇతర రక్షణ పరికరాలను(త్రీ లేయర్ మాస్క్) ధరించాలి అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.


భారత రాజధాని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా ని ఎలా అరికట్టాలో చెబుతూ... వలస కూలీలు ఎక్కడ ఉంటే అక్కడే ఉండమని తిండి, ఆశ్రమం కల్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టుగా లాక్ డౌన్ అందరూ పాటించాలని లేకపోతే కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతుందని ప్రజల్లో అవగాహన కల్పించారు కేజ్రీవాల్. రద్దీ ప్రాంతాల్లో ఒక్క వ్యక్తికి కరోనా సోకితే అది అందరికీ సంక్రమిస్తే ప్రమాదముందని... నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే మారుమూల ప్రాంతాలకు కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు.



ఇకపోతే తమిళనాడులో ఇప్పటివరకు కొత్తగా 8 కేసులు నమోదు కాగా... మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50 కి చేరుకుంది. ప్రస్తుతం క్రీడా మైదానాలు మొత్తం ఖాళీ చేయించగా... ఖాళీ పాఠశాలలో కూలీలకు ఆశ్రమం కల్పిస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. ఒకవేళ ఈ లాక్ డౌన్ సమయంలో బోర్ కొడితే భగవద్గీత చదువుకోండని ఆయన అన్నారు. గోవాలో కొత్తగా 2 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య ఐదుకు చేరుకుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో కొత్తగా 7 కేసులు నమోదు కాగా మొత్తం బాధితుల సంఖ్య 83 కు చేరుకుంది. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 19 మందికి కరోనా వైరస్ సోకగా ఈ రోజు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 67కు పెరగగా ఇప్పటివరకు ఒకరు వ్యాధి లక్షణాలతో మరణించగా ఒకరు మాత్రం వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నారు. అయితే 67 మందిలో 11 మందికి నెగిటివ్ అని తేలిందని కేటీఆర్ చెప్పారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: