యూరప్ లో అంతటా కరోనా వైరస్( కోవిడ్ -19 ) వ్యాపించిన సమయంలో... జర్మనీలో తక్కువ మరణాల రేటు కొనసాగుతోంది. కరోనా వైరస్  నుంచి కోలుకుంటున్న చైనాలోని వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.  హుబే ప్రావిన్సులోని వూహాన్ నగరంతో పాటు ఆయా ప్రాంతాల్లో  రవాణా, ప్రయాణికుల సర్వీసులు ప్రారంభమయ్యాయి.   జర్మనీలో కూడా కరోనా కేసులు తక్కువేం కాదు. ఇప్పటివరకు 22వేల 400మందికి వైరస్ సోకినట్లు నిర్థారణ అవగా,కేవలం 84మంది మాత్రమే చనిపోయినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయి.

 

వాణిజ్య వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది.  ఈ నేపథ్యంలో కొంత మంది ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.  కరోనా వైరస్ మహమ్మారి నేరుగా ప్రాణాలు తీయడమే కాదు, పరోక్షంగా ఆత్మహత్యకు కూడా కారణమైన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది.  హెస్సే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయంతో ఆర్థికశాఖ మంత్రి థామస్ షాఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 54 ఏళ్ల షాఫర్ మృతదేహం ఫ్రాంక్ ఫర్ట్ లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద పడివుండగా గుర్తించారు.  

 

అయితే థామస్ షాఫర్ ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు.. హెస్సే రాష్ట్ర ముఖ్యమంత్రి వోల్కెర్ బౌఫీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  హెస్సే ముఖ్యనగరం ఫ్రాంక్ ఫర్ట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్యాంకులకు పుట్టినిల్లు. కరోనా వైరస్ ప్రభావంతో ఇక్కడి ఆర్థిక రంగ కార్యకలాపాలు బాగా కుంటుపడ్డాయి.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: