కిడ్నీలో రాళ్లు...ప్రస్తుత కాలంలో ఎక్కువ మందికి ఎదురవుతున్న సమస్య. మారిన జీవన శైలి, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, స్ధూలకాయం లాంటి కారణాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో, ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

 

కరోనా వ్యాప్తి చెందడంపై అనేక అనుమానాలు పెట్టుకుంటున్నారు.ఈ క్రమంలోనే  కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కరోనా వ్యాప్తి ఎక్కువ చెందే అవకాశముండటంతో, కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఎక్కువ భయపడుతున్నారు. తమకు కరోనా వచ్చే అవకాశముందేమో అని భయపడిపోతున్నారు. అయితే కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడేవారికి కరోనా రావడమనేది ఒక అపోహ మాత్రమే. కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కరోనా త్వరగా ఎటాక్ చేయడానికి అసలు ఆస్కారం లేదని ప్రముఖ కిడ్నీ నిపుణులు తేల్చేసారు.

 

అయితే ప్రస్తుతం కరోనా ద్వారా చనిపోతున్న వారిలో ఎక్కువ కిడ్నీ వ్యాధులు ఉంటున్నాయి. అంటే కిడ్నీ పనితీరు సరిగా లేకపోవడం, కిడ్నీ ఇన్ఫెక్షన్,  కిడ్నీ ఫెయిల్, కిడ్నీలో సెల్స్ సరిగా వర్క్ చేయకపోవడం. ఈ సమస్యలు ఉన్నవారికి ఆటోమేటిక్ గా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి, త్వరగా కరోనా వ్యాప్తి చెందే అవకాశముంది.  కానీ కిడ్నీలో రాళ్లు సమస్య ఉన్నవారికి కరోనా వ్యాప్తి లేదు.

 

కాకపోతే ఇక్కడొక సమస్య ఉంది. కిడ్నీలో రాళ్ల సమస్య పెరిగిపోయినవారికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ పనితీరు సరిగా ఉండదు. దీంతో శరీరంలో ఎక్కువ మలినాలు పేరుకుపోయి, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకోసారి ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది. దీంతో మనిషి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కరోనా వచ్చే అవకాశముంటుంది. అలాగే కరోనా ఎక్కువై చివరికి చనిపోయే ప్రమాదం కూడా ఉంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple  

మరింత సమాచారం తెలుసుకోండి: