దేశంలో కరోనా వ్యాప్తి జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తల తీసుకుంటున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే దేశంలో కరోనా గురించి లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా తెలంగాణలో కరోనా ఎఫెక్ట్ లేదని.. విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ కరోనా ఉందని స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.  తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 అని, ఒక వ్యక్తి డిశ్చార్జి అయ్యాడని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కరోనా బాధితుల్లో 11 మందికి నెగెటివ్ రావడం శుభవార్తగా భావిస్తున్నామని తెలిపారు.  ప్రస్తుతం కరోనా సంఖ్య తగ్గుతుందని.. అన్నారు.   

 

తమ వద్ద 58 మంది బాధితులు ఉంటారని, వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి కోలుకున్నవారిని డిశ్చార్జి చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్టులు మూతపడడంతో బయటి దేశాల నుంచి కరోనా బాధితులు వచ్చే అవకాశం లేదని, తెలంగాణలో ఉన్న వారికి నయం చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందకుండా చూడడమే తమ ప్రాధాన్య అంశమని తెలిపారు.  25,937 మందిపై నిఘా ఉందని, వారిలో 14 రోజుల పరిశీలన పూర్తయిన వారిలో కరోనా లక్షణాలేవీ లేకపోతే పంపించివేస్తామని అన్నారు.

 

మార్చి 30 నాటికి 1899 మందిని, మార్చి 31 నాటికి 1450 మందిని... ఇలా దశలవారీగా లక్షణాలు లేనివారిని  పంపించేస్తామని వెల్లడించారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు లేవని, అందుకే మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం లాక్ డౌన్ ను ప్రయోగించడం జరిగిందని, ఈ నిర్ణయాన్ని అంతర్జాతీయంగా అందరూ అభినందిస్తున్నారని అన్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: