ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్‌.. తెలంగాణ‌లోనూ వేగాన్ని పెంచుకుంటుంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఈ రోజు మరో ముగ్గురికి కరోనా సోకినట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఈ రోజుకి ఆ సంఖ్య 70కి పెరిగింది. అయితే ఇందులో ఒక వ్యక్తి డిశ్చార్జి అయ్యాడని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మ‌రియు కరోనా బాధితుల్లో 11 మంది కోలుకోవ‌డం శుభవార్తగా భావిస్తున్నామని తెలిపారు. ఇక తమ వద్ద 58 మంది బాధితులు ఉంటారని, వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి కోలుకున్నవారిని డిశ్చార్జి చేస్తామని తెలిపారు. 

 

ఈ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్ మన పల్లెలు బాగా నియంత్రణ పాటిస్తున్నాయి. గ్రామాల్లో చాలా క్రమశిక్షణతో ఉంటున్నారు.. వేరే గ్రామాల వారు రాకుండా జాగ్రత్త పడుతున్నారు అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. అయితే ఇలాంటి సమయంలో పట్టణాలకు వచ్చి కరోనా అంటించుకోవద్దు.. జాగ్రత్తగా ఉండండి.. కరోనాను జయిస్తాం.. అందుకే దాన్యం, మొక్క జొన్న గ్రామాల్లోనే కొంటాం.. పట్నాల్లోని మార్కెట్ యార్డులకు రావద్దు.. కూపన్ల ద్వారా కొంటాం.. ఆన్ లైన్లో మీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి అంటూ ప‌ల్లె ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ హామీ ఇచ్చారు.

 

అంతేకాకుండా, అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్టులు అన్నీ మూతపడడంతో బయటి దేశాల నుంచి కరోనా బాధితులు వచ్చే అవకాశం లేదని.. ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మ‌రియు తెలంగాణలో ఉన్న వారికి నయం చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణలో కరోనా వ్యాప్తి చెందకుండా చూడడమే తమ ప్రాధాన్య అంశమని తెలిపారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు లేవని, అందుకే మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం లాక్ డౌన్ ను ప్రయోగించడం జరిగిందని కేసీఆర్ తెలిపారు. అలాగే లాక్‌డౌన్‌కు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని సూచించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: