చైనాలో మొదలై యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకర వైరస్ కరోనా. వైద్యంలేని రోగంగా ఉన్న ఈ కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 32 వేలపైనే ప్రజలు మరణించారు. అలాగే దాదాపు 6 లక్షల 83 వేల వరకు ప్రజలు కరోనా బారిన పడ్డారు. ఇటు ఇండియాలో కూడా దాదాపు వెయ్యి మందికి కరోనా సోకగా, 25 మంది వరకు చనిపోయారు.

 

అయితే కరోనా వ్యాప్తి పెరగకుండా ఉండేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ పాటిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, ప్రజలు ఎవరు బయటకు రావడం లేదు. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. కాకపోతే భారత్ ఇప్పుడు లాక్ డౌన్ పాటించడం కంటే ముందు అంతర్జాతీయ విమానాల్ని ఆపేసి ఉంటే బాగుండేదని మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. చైనా వైరస్ మొదలు కాగానే విమాన సర్వీసులని ఆపేసి ఉంటే, ఈ స్థాయిలో కరోనా వ్యాప్తి ఉండేది కాదనే వాదన ఎక్కువ వినిపిస్తోంది.

 

ఇదే విషయంలో అతి చిన్న దేశమైన వియత్నాం చర్యలని మెచ్చుకోవచ్చు. దాదాపు 80 లక్షల ప్రజలతో ఉన్న వియత్నాం, చైనాకు అతి సమీపంలో ఉంటుంది. చైనాలో కరోనా మొదలు కాగానే, వియత్నాం అలెర్ట్ అయింది. చైనా కంటే ముందే లాక్ డౌన్ లోకి దిగేసింది. వెంట‌నే చైనాతో ఉన్న స‌రిహద్దును మూసివేసింది. జనవరి 1 నుంచే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేసింది. అటు విమాన సర్వీసులని కూడా నిలిపివేసింది.

 

ఇక ఈ లోపు ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో....వారిని సర్వే చేసి పట్టుకున్నారు. అలాగే వారు ఎవరెవరితో తిరిగారో కూడా కనుక్కుని టెస్టులు చేసారు. ఇక మొత్తం మీద ఆ దేశంలో 188 కరోనా కేసులు తేలాయి. అయితే అక్కడ ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. ఇక రాను రాను కరోనా కేసుల సంఖ్యకూడా తగ్గడంతో చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా ఎత్తేసారు.

 

కాకపోతే జనాభా తక్కువ కాబట్టి వియత్నాంలో త్వరగా కరోనా కేసులు నిర్ధారించుకోవడానికి ఇబ్బంది ఎదురవలేదు. కానీ భారతదేశం అలా కాదు కాబట్టి, కాస్త కరోనా కేసులు గుర్తించడంలో ఆలస్యం జరుగుతుంది. ఇక ఈలోపు ఎన్ని కొత్త కేసులు వచ్చి పడతాయో అర్ధం కాకుండా ఉంది. ఏదేమైనా చైనాలో వైరస్ మొదలు కాగానే, విమాన సర్వీసులని నిలిపివేసి ఉంటే బాగుండేది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple  

మరింత సమాచారం తెలుసుకోండి: