క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్-19.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు క‌మ్మేస్తూ.. ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందులు పెడుతున్నారు. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా కాటుకు వేల మంది బ‌లైపోయారు. ల‌క్ష‌ల్లో క‌రోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణ‌లో సైతం క‌రోనా వేగాన్ని పుంజుకుంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి కరోనా నేపథ్యంలో ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు.

 

ఈ క్ర‌మంలోనే నేడు మరో ముగ్గురికి కరోనా సోకినట్టు కేసీఆర్ ప్రకటించారు. దీంతో తెలంగాణ‌లో ఈ రోజుకి క‌రోనా పాసిటివ్ కేసుల సంఖ్య‌ 70కి పెరిగింది. అయితే కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో 11 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని.. వారిని సోమవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మిగతా వారిలో కూడా చాలా మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే..  సోషల్ మీడియాలో వేదిక చాలా మంది దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. వాళ్లను పట్టుకోలేకపోతామనుకుంటున్నారు. 

 

కానీ, వాళ్లను ఖ‌చ్చితంగా పట్టుకుంటాం.. భయంకరంగా శిక్షిస్తాం.. అలాంటి వాళ్లకే ముందు కరోనా వస్తది.. మీరేమైనా అతీతులా.. మీకు కరోనా రాదా.. అంటూ కేసీఆర్ తీవ్రంగా మండిప‌డ్డారు. కాగా, క‌రోనా వైర‌స్‌ను వ్యాపించకుండా కాపాడుకోవడమే భారత్‌ ఏకైక ఆయుధమని, స్వీయ నియంత్రణ వల్లే కరోనాను అరికట్టవచ్చని సీఎం స్పష్టం చేశారు. కరోనా క్రిమి చిన్నదైనా చాలా పదునైనదని, మనం జాగ్రత్తగా ఉండడమే ముఖ్యమని హెచ్చరించారు. కాబ‌ట్టి ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ను పాటించాలని, వైద్యులు, పోలీస్‌ అధికారులకు సహకరించాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. మ‌రియు హోంక్వారంటైన్‌లో ఉన్న వాళ్లను రోజుకు రెండుసార్లు పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలియ‌జేసారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: