కరోనా వల్ల ప్రపంచ దేశాల పరిస్దితి దయనీయంగా మారుతుంది.. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తన పంజా విప్పుతుంది.. అయితే ఇక్కడ ప్రపంచదేశాలకు మనకు చాలా పోలికలు ఉన్నాయి.. అక్కడి వారు రోగనిరోధక శక్తిని మందుల రూపంలో పెంచుకుంటారు.. మనదేశంలో అయితే నిత్యం మనం తీసుకునే ఆహారంలోనే అవి లభిస్తాయి.. వాటిలో కొన్ని ముఖ్యమైనవి పసుపు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి ఇలా రకరకాలైన దినుసులు వంటలలో ఉపయోగించడం వల్ల.. వాటి ద్వారా నిత్యం మనశరీరంలోకి మనకు తెలియకుండానే ఎన్నో మిటమిన్స్, ప్రోటిన్స్ వెళ్లుచున్నాయి.. అందుకే భారతీయులకు కాస్త రోగనిరోధక శక్తి ఎక్కువ అంటారు..

 

 

అలాగే మన ఆయుర్వేదం కూడా ఇదే చెబుతుంది.. మన వంటిల్లే ఒక ఆయుర్వేద నిలయం.. ఇదే గాక మన భారతదేశం లో ప్రకృతిపరంగా ఎన్నో పండ్లు, లభిస్తాయి.. వీటిని స్వీకరించడం ద్వారా కూడా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.. ప్రస్తుత కాలంలో మనుషులు అంతా ట్నెక్నాలజీ అంటూ కాలం వెంట పరుగులు తీస్తూ, మన పూర్వీకులు మనకు అందించిన అలవాట్లను మరచి రోగాలను ఆహ్వానిస్తున్నారు.. పాతకాలం పాత పద్దతులు అంటూ తేలిగ్గా కొట్టిపడేసి, విదేశాల మోజులోపడి ఆధునికతే అలంకరణగా బ్రతుకుతున్న ఈ జీవితంలో ఇలా అప్పుడప్పుడు కరోనా వంటి అంటురోగాలు వచ్చి మన సంప్రదాయపద్దతులను గుర్తుకు తెస్తున్నాయి.. మళ్లీ మనుషులకు పాతపద్దతులను అలవాటు చేస్తున్నాయి..

 

 

ఇకపోతే కరోనా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ, ప్రజలకోసం తపిస్తున్నాడు.. ఈదశలో ఇక్కడి ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోండని సలహా ఇవ్వడమే కాకుండా ఇందుకు గాను ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడు.. ఇందులో భాగంగా తెలంగాణలో బత్తాయి వంటి పండ్లు బాగా పండాయి. వాటిని ఇతర రాష్ట్రాలకు పంపొద్దు.. మన తెలంగాణ వాళ్లే తినాలి.. అవి చాలా చీపుగా దొరుకుతాయి. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచుతాయి. ఇప్పుడు ఈ పండ్ల అవసరం చాలా ఉంది కాబట్టి వీటిని అన్ని చోట్లా అమ్మేలా ఏర్పాట్లు చేస్తాం అంటూ పేర్కొన్నారు.. అదీగాక హైదరాబాద్‌లోని ప్రతి గేటెడ్ కమ్యూనిటీ మందు వీటిని అమ్మేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.... 

మరింత సమాచారం తెలుసుకోండి: